ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోష‌న్‌.. సినీ నటులకు బిగ్ షాక్

ABN, Publish Date - Mar 17 , 2025 | 06:54 PM

Betting Apps Pomotion Case: బెట్టింగ్ యాప్స్ వల్ల ఇటీవల పలువురు బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ప్రముఖులు వీటిని ప్రచారం చేస్తుండటంతో బాధితులు వీటికి వెంటనే ఆకర్షితులు అవుతున్నారు. ఈ యాప్‌ల వల్ల బాధితులు తనువు చాలిస్తున్నారు. వీటిని ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై పోలీసులు ఇప్పుడు దృష్టి సారించారు.

Betting Apps Promotion Case

హైదరాబాద్: బెట్టింగ్‌ యాప్‌ల వల్ల యువత సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్‌ యాప్‌‌లు నిర్వహించే వారు పెద్దఎత్తున ప్రకటనలు ఇస్తు మోసగిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల బారినపడుతున్న బాధితులు అప్పులపాలై ఆత్మహత్మలు చేసుకుంటున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల‌ను ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, సెలబ్రిటీలు కూడా బాధితులు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రముఖులు బెట్టింగ్‌ యాప్‌ల‌ను ప్రచారం చేస్తుండటంతో యువత వీటికి వెంటనే ఆకర్షితులు అవుతున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల‌ వల్ల ఎంతగానో నష్టపోతున్నారు. క్రమంగా అప్పుల పాలై జీవితాన్ని చాలిస్తున్నారు. ఇలాంటి యాప్‌లు సమాజానికి చాలా నష్టం కలిగిస్తుండటంతో పోలీసులు ఈ బెట్టింగ్‌ యాప్‌ల‌పై ఫోకస్ పెట్టారు.


పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు..

వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఇవాళ(సోమవారం) పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజతో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌లపై కేసు నమోదు చేశారు. అమాయకులను మోసం చేసి రూ. వందల కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లను పోలీసులు కటకటాల్లోకి నెడుతున్నారు. అతిపెద్ద మల్టీలెవల్‌ మోసానికి తెలియకుండానే ప్రచారం కల్పించిన సెలబ్రిటీలకు సైబరాబాద్‌ పోలీసులు గతంలో నోటీసులు జారీ చేశారు.


పోలీసుల వార్నింగ్..

ఆ జాబితాలో అనిల్‌కపూర్‌, షారుఖ్‌ఖాన్‌, బొమన్‌ ఇరానీ, వివేక్‌ ఒబెరాయ్‌, జాకీష్రాఫ్‌, అల్లుశిరీష్‌, పూజాహెగ్డే, యువరాజ్‌ సింగ్‌ తదితరులు ఉండటం గమనార్హం. వారిలో కొంతమంది నోటీసులకు స్పందించి వారి న్యాయవాదుల ద్వారా సమాధానాలు ఇచ్చారు. సమాధానాలు ఇవ్వని సెలబ్రిటీలకు పోలీసులు రెండవసారి నోటీసులు జారీ చేశారు. వినియోగదారుల ఫోరం సవరణ చట్టం 1986 చట్టం ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాప్‌లు, ఉత్పత్తులకు ప్రచారం చేస్తే వారిపై ఏడాది నుంచి మూడేళ్ల పాటు నిషేధం విధించవచ్చు. రూ.10లక్షల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలుశిక్ష తప్పదని పోలీస్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్

Hyderabad: ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..

For Telangana News And Telugu News

Updated Date - Mar 17 , 2025 | 07:33 PM