ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhoodan Land Case: భూదాన్ భూముల కేసులో ఐపీఎస్‌లకు చుక్కెదురు

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:18 PM

Bhoodan Land Case: భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. కేసు విచారణలో భాగంగా ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం.

Bhoodan Land Case

హైదరాబాద్, ఏప్రిల్ 30: భూదాన్ భూముల కేసులో ఐపీఎస్‌ అధికారులకు హైకోర్టులో (Telangana High Court) చుక్కుదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఐపీఎస్ అధికారులు (IPS Officers) హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు (బుధవారం)వీరి పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్‌కు ఎందుకు వచ్చారని ఐపీఎస్‌ అధికారులపై మండిపడింది. అలాగే సింగ్‌ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మళ్ళీ సింగిల్ బెంచ్‌కు వెళ్లాలని ఐపీఎస్‌లకు డివిజన్ బెంచ్ సూచించింది.


ఈకేసుకు సంబంధించి సింగిల్ బెంచ్ తుది నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఆపై ఐపీఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ముగించింది. కాగా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోనిసర్వే నెంబర్‌ 194లో ఐపీఎస్‌లు భూములు కొన్నారు. సర్వే నెంబర్‌లో 194 లో 16,20,18 గుంటలుగా భూములను ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేశారు. అయితే సర్వే నెంబర్‌ 181, 182,194,195 భూముల నిషేధిత జాబితాలో ఉంచాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐపీఎస్‌లు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలని..హైకోర్టులో ఐఏఎస్ ఐపీఎస్‌ల అప్పీళ్లు చేశారు. తాము కొన్న భూములు భూదాన్‌వి కాదని,పట్టా భూమూలేనంటూ ఐఏఎస్, ఐపీఎస్‌ల పిటిషన్‌‌లు వేశారు.

India Vs Pak: కవ్విస్తున్న పాక్.. యుద్ధం తప్పదా..


ఐపీఎస్‌లు రవిగుప్తా, తరుణ్‌ జోషి, బి.కె రాహుల్‌ హెగ్డే, జితేందర్‌ కుమార్‌ గోయల్‌ భార్య రేణుగోయల్‌, ఐఏఎస్ జనార్థన్‌ కుమారుడు రాహుల్‌ బుసిరెడ్డి, ఐపీఎస్‌లు మహేశ్‌ భగవత్‌, సౌమ్య మిశ్ర, స్వాతి లక్రా, ఉమేష్‌ షరాప్‌ ఆర్య రేఖలతో పాటు వీరన్నగారి గౌతం రెడ్డి అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగగా.. పిటిషనర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. అంతే కాకుండా ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. తిరిగి సింగ్‌ బెంచ్‌లో అప్పీళ్లు చేసుకోవాలని ఆదేశిస్తూ విచారణను హైకోర్టు డివిజిన్ బెంచ్ ముగించింది.


ఇవి కూడా చదవండి

PM Modi: గోడ కూలి ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం..

10th Results: మరికాసేపట్లో టెన్త్ రిజల్ట్స్.. చెక్‌ చేసుకోండిలా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 12:32 PM