PM Modi: గోడ కూలి ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం..
ABN , Publish Date - Apr 30 , 2025 | 10:44 AM
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), విశాఖపట్నం (Visakhapatnam), సింహాచలం (Simhachalam) చందనోత్సవం (Chandanotsavam) సందర్భంగా గోడ కూలిన (wall collapse) ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) స్పందించారు. ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.
Also Read:
సింహాచలం ఘటనపై కేటీఆర్ స్పందన..
రాహుల్ గాంధీ సంతాపం..
విశాఖపట్టణం, సింహాచలం ఆలయ ప్రాంగణంలో గోడ కూలి.. పలువురు మృతిచెందిన ఘటనపై పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. పలువురు మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేసినట్లు సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
సింహాచలం ఘటనపై కిషన్ రెడ్డి స్పందన..
విశాఖపట్టణం, సింహాచలం ఆలయ ప్రాంగణంలో గోడ కూలిన ఘటనలో పలువురు మృతి చెందిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పవిత్రమైన అక్షయతృతీయ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రావడం, ఈ సందర్భంలో గోడ కూలి ప్రాణనష్టం జరగడం విచారకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు.
కాగా సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలి, వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రిస్క్యూ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, మృతదేహాలను కేజీహెచ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.
మే 2న ఏపీ పర్యటనకు మోదీ..
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పనుల పునఃప్రారంభానికి మే 2న రానున్నారు. అమరావతిలో ప్రధాని ఆవిష్కరించాల్సిన పనులు, మోదీ పర్యటన వివరాలపై సిఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమీషనర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సుమారు లక్ష కోట్ల రూపాయలు పనులను ప్రధాని అమరావతిలో పట్టాలు ఎక్కించనున్నారు. వివిధ పనులకు శంఖుస్ధాపనలు చేయనున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతిలో ఫైలాన్ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పైలాన్‌పై ఏపీ రాష్ట్ర చిహ్నం బంగారు వర్ణంలో ఉన్న పూర్ణకుంభంతో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఆరుమీటర్లు ఎత్తుతో పైలాన్ ఏర్పాట్లు ఉండనున్నాయి. ఫైలాన్‌పై కార్యక్రమ, అతిథుల వివరాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..
సింహాచలం ఘటన నన్ను కలచివేసింది..
For More AP News and Telugu News