Share News

Simhachalam incident: సింహాచలం ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి..

ABN , Publish Date - Apr 30 , 2025 | 07:34 AM

అమరావతి: శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు.

Simhachalam incident: సింహాచలం ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి..
CM Chandrababu Naidu, Pawan Kalyan, Nara Lokesh

విశాఖ: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి (Sri Varaha Lakshmi Narasimha Swamy) చందనోత్సవం (Chandanotsavam) ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలి (wall collapse) 8 మంది మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. భారీ వర్షాల (Rain) కారణంగా ప్రమాదం జరిగిందని, పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు ఎక్స్(Twitter) వేదికగా పేర్కొన్నారు.

Also Read: సింహాచలంలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి


సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం: పవన్ కల్యాణ్

సింహాచలంలో గోడ కూలడం కారణంగా క్యూ లైన్‌లో ఉన్న 8 మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చందనోత్సవ వేళ ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నానని, భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించానని పవన్ కల్యాణ్ అన్నారు.


తీవ్ర ఆవేదనకు గురిచేసింది: మంత్రి లోకేష్

సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని, బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.


అప్పన్న సన్నిధిలో అపశృతి..

కాగా సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలి, వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రిస్క్యూ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, పోస్టుమార్టం నిమితం మృతదేహాలను కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

1300 కోట్లతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి: సంధ్యారాణి

అడ్డగోలు భూపందేరాలు చేసింది జగనే: అశోక్‌బాబు

For More AP News and Telugu News

Updated Date - Apr 30 , 2025 | 11:07 AM