Simhachalam: చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి.. ఏడుగురు మృతి..
ABN , Publish Date - Apr 30 , 2025 | 06:27 AM
విశాఖపట్నం: సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలి వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నారు.
విశాఖపట్నం: సింహాచలంలో (Simhachalam) ఘోర ప్రమాదం (tragedy) జరిగింది. చందనోత్సవం (Chandanotsavam) వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ (300 rupees ticket Counter) దగ్గర గాలి, వానకు గోడ కూలిపోయింది (wall collapse). ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రిస్క్యూ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, మృతదేహాలను కేజీహెచ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.
Also Read: 1300 కోట్లతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి: సంధ్యారాణి
భారీ వర్షం..

సింహాచలం చందనోత్సవం వేళ భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో భారీ గోడ కూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ప్రసాదం స్కీం కింద అక్కడ గోడ నిర్మించారు. అక్కడ డెవలప్‌మెంట్ చేస్తున్నారు. అందులో భాగంగా గోడ కట్టారు. ఆ గోడ పక్కనుంచే రూ. 3 వందల టిక్కెట్ లైన్ ఉంది. బుధవారం తెల్లవారుజాము 2:30 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గోడ కూలింది. ఆ ప్రక్క నుంచి క్యూ లైన్ నుంచి వెళుతున్న భక్తులపై గోడ పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం హోంమంత్రి, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాత్రుల తరలింపుకు 17 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అనగాని..
సింహాచలంలో గోడకూలిన ఘటనపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు గోడ కూలి ఏడుగురు భక్తులు చనిపోవడం, పలువురు గాయపడడం తీవ్రంగా బాధించిందన్నారు. గోడ కూలిన ప్రాంతంలో సహాయక చర్యలను మంత్రులు, అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నామని, చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయన్నారు.
సహాయక చర్యలను పర్యవేక్షించిన హోంమంత్రి
సింహాచలంలో గోడకూలిన ఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలిందన్నారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ శాఖ సిబ్బంది నేతృత్వంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని హోం మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉగ్రవాదులపై స్పైవేర్ వాడితే తప్పేంటి
అడ్డగోలు భూపందేరాలు చేసింది జగనే: అశోక్‌బాబు
For More AP News and Telugu News