Share News

Minister Sandhyarani: 1300 కోట్లతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి: సంధ్యారాణి

ABN , Publish Date - Apr 30 , 2025 | 06:22 AM

రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం 1300 కోట్లతో పనులు ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు, చెంచుల, యానాదులకు ఆధార్‌, రేషన్‌ కార్డులు ఇవ్వడం వంటి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

Minister Sandhyarani: 1300 కోట్లతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి: సంధ్యారాణి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో గిరిజన ప్రాంతాల్లో రూ.1,300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రూ.వెయ్యి కోట్లతో డోలీ మోతలు నివారించేందుకు, రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. మంగళవారం సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అరకు కాఫీని లక్ష ఎకరాల్లో సాగు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. శ్రీశైలంలోని చెంచులు, యానాదులకు ఆధార్‌, రేషన్‌ కార్డులు ఇవ్వాలని ఆదేశించామన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 06:23 AM