Share News

KTR: సింహాచలం ఘటనలో తీవ్రంగా బాధపడ్డా..

ABN , Publish Date - Apr 30 , 2025 | 10:10 AM

సింహాచలంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. తీవ్రంగా బాధపడ్డానని వారి కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

KTR: సింహాచలం ఘటనలో తీవ్రంగా బాధపడ్డా..
BRS Leader KTR

హైదరాబాద్: సింహాచలం ఘటన (Simhachalam tragedy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Ex Minister KTR) స్పందించారు. సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో పలువురు మృతి చెందడంతో తీవ్రంగా బాధపడ్డానని, మరణించిన వారి కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానని సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. అలాగే దురదృష్టకర సంఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా


కేటీఆర్‌కు గాయం

కాగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా.. ఆయన నడుముకు గాయం అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ విషయాలను స్వయంగా కేటీఆర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా.. నడుముకు గాయం అయింది. డాక్టర్లు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తా’ అని పేర్కొన్నారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. ఆ కేసును హైకోర్టు కొట్టి వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..

సింహాచలం ఘటన నన్ను కలచివేసింది..

సింహాచలంలో ఘోర ప్రమాదం..7 గురు మృతి

For More AP News and Telugu News

Updated Date - Apr 30 , 2025 | 10:10 AM