Miss England: మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలి: కేటీఆర్
ABN, Publish Date - May 25 , 2025 | 02:25 PM
మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్త్రీని శక్తిగా పూజించే తెలంగాణ గడ్డపై ఇలాంటి ఘటనలకు చోటు లేదన్న ఆయన, యావత్ తెలంగాణ సమాజం తరుపున క్షమాపణలు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. స్త్రీని శక్తిగా పూజించే తెలంగాణ గడ్డపై ఇలాంటి ఘటనలకు చోటు లేదన్న ఆయన, యావత్ తెలంగాణ సమాజం తరుపున మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగికి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లోనూ ఈ ఘటనపై స్పందించారు. తనను వేధించారని మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజల ఆశీర్వాదంతో జరిగిన ఈ శుభకార్యం ఎప్పటికీ గుర్తుంటుంది..
సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం
For More AP News and Telugu News
Updated Date - May 25 , 2025 | 02:28 PM