ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Electricity: ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..

ABN, Publish Date - Jun 26 , 2025 | 07:13 AM

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు.

- నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

హైదరాబాద్: బంజారాహిల్స్‌(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ జయప్రకాష్ నగర్‌, అమర్‌ సొసైటీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ సత్యసాయి కల్యాణ మండపం, ఫోనిక్స్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలో..

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్‌ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ రాజీవ్‌నగర్‌, మయూరిమార్గ్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ ఎస్‌ఆర్టీనగర్‌, దుర్గానగర్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

హైదర్‌నగర్‌: పోలీస్‌ స్టేషన్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అడ్డగుట్ట రోడ్డు 11, 12, సమతానగర్‌లో విద్యుత్‌ ఉండదని అధికారులు తెలిపారు. ఆదిత్యనగర్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదిత్యనగర్‌, తులసీనగర్‌, శుభోదయకాలనీ, హెచ్‌ఎంటీకాలనీ, సాయిప్రశాంత్‌నగర్‌లో విద్యుత్‌ ఉండదన్నారు.

కేపీహెచ్‌బీకాలనీ పరిధిలో..

కేపీహెచ్‌బీకాలనీ: టీజీఎస్పీడీసీఎల్‌ బాలాజీనగర్‌ సెక్షన్‌ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. పీపుల్స్‌ హాస్పిటల్‌, వివేక్‌నగర్‌ రోడ్డు నంబర్‌ 1,3,4, ప్రగతి డిగ్రీ కాలేజ్‌, న్యూ బాలాజీనగర్‌, వైఎ్‌సఆర్‌ చౌరస్తా, హనుమాన్‌ టెంపుల్‌, యోగ్యతా అపార్ట్‌మెంట్‌ ప్రాంతాల్లో ప్రాప్రపాపపపాపారఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌, ఓమ్ని హాస్పిటల్‌, శ్రీచైతన్య కాలేజ్‌, చెన్ను అపార్ట్‌మెంట్‌, బాలాజీనగర్‌ దర్గా, శాంతి నిలయం ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.

సంతోష్‏నగర్‌: టీఎస్ఎస్పీడీసీఎల్‌ సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని 11కేవీ నాగోల్‌, విద్యుత్‌నగర్‌, హుడాకాంప్లెక్స్‌(Vidyutnagar, Huda Complex), సరూర్‌నగర్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో నిర్వహణ పనుల కారణంగా గురువారం విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడుతుందని డీఈ తెలిపారు. 11కేవీ న్యూనాగోల్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు, 11కేవీ విద్యుత్‌నగర్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంటల వరకు, 11కేవీ హుడాకాంప్లెక్స్‌, సరూర్‌నగర్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి.

వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 26 , 2025 | 07:13 AM