Share News

Gold and Siver Rates Today: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:43 AM

దేశంలో కొన్ని రోజుల క్రితం 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల స్థాయికి చేరుకోగా, ఇప్పుడు క్రమంగా దిగివస్తోంది. దీంతోపాటు వెండి రేట్లు (Gold Rates Today June 26th, 2025) కూడా ఇదే స్థాయిలో పడిపోయాయి. అయితే నేడు వీటి ధరలు ఏ మేరకు తగ్గాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Siver Rates Today: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold and Siver Rates Today

బంగారం, వెండి ప్రియులకు ఈరోజు కూడా శుభవార్త వచ్చేసింది. జూన్ 26న 2025న వీటి ధరలు ఒక్కసారిగా తగ్గాయి (Gold Price Drop June 26 2025). ఈ నేపథ్యంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం జూన్ 26, 2025న ఉదయం 6.30 గంటల నాటికి బంగారం ధర (Gold Rates Today June 26th, 2025) గత రోజుతో పోల్చితే రూ. 270 తగ్గింది. ఇది బంగారాన్ని కొనాలనుకునే వారికి మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,940కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,690గా చేరింది.


ఈరోజు వెండి ధరలు ఎంతకు చేరాయంటే..

ఇటీవల బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గడం ప్రారంభమైంది. ఇదే క్రమంలో, ఢిల్లీలో వెండి ధరలు కిలోకు రూ. 1000 తగ్గి, ప్రస్తుతం రూ. 1,07,800కి చేరాయి. అలాగే, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా వీటి ధరలు తగ్గిపోయాయి. హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విజయవాడ వంటి ప్రాంతాలలో కూడా కిలో వెండి ధరలు రూ. 1,000 తగ్గి, రూ. 1,17,900కి చేరుకున్నాయి. ఇదే సమయంలో చెన్నై, కేరళ ప్రాంతాలలో కూడా వెండి ధరలు రూ. 1,17,900కు చేరాయి. దీంతోపాటు ఇతర ప్రధాన నగరాలైన నాసిక్, నోయిడా, మైసూర్, నాగ్‌పూర్, పాట్నా, సూరత్, జైపూర్, ముంబైలో కూడా వెండి ధరలు తగ్గి, రూ. 1,07,900 స్థాయికి చేరుకున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందంటే..

ప్రపంచ ఆర్ధిక మార్కెట్లలో అనిశ్చితి పెరిగిన నేపథ్యంలో బంగారం ధర బుధవారం 3,320 డాలర్ల స్థాయికి చేరింది. ఇది ఆగష్టు 1.3% పడిపోయిన తరువాత మళ్లీ స్థిరంగా ఉందని నిపుణులు అంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపులపై అంచనాలు పెరగడంతోపాటు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కూడా వీటి ధరల నియంత్రణకు కారణమైంది. ఇరాన్ అణు ప్రణాళికపై యూఎస్ జరిపిన దాడుల కారణంగా ఇరాన్ ప్రోగ్రామ్ కొన్ని నెలలు ఆలస్యం అయిందని అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. దీంతో ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి కొనసాగుతోంది. అంతేకాదు, జూన్‌లో యూఎస్ వినియోగదారుల విశ్వాసం అనూహ్యంగా పడిపోయింది. దీంతో వడ్డీ రేట్లు తగ్గిపోవడంపై అంచనాలు మరింత పెరిగాయి.


ఇవీ చదవండి:

జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..


ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 10:41 AM