ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ముంబై స్మగ్లర్‌కు హైదరాబాద్‌లో నెట్‌వర్క్‌!

ABN, Publish Date - May 11 , 2025 | 05:55 AM

ముంబై స్మగ్లర్‌ నుంచి డ్రగ్స్‌ కొంటూ పట్టుబడిన వైద్యురాలి కేసులో రాయదుర్గం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం, మే 10 (ఆంధ్రజ్యోతి): ముంబై స్మగ్లర్‌ నుంచి డ్రగ్స్‌ కొంటూ పట్టుబడిన వైద్యురాలి కేసులో రాయదుర్గం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తన అనుచరుడు బాలకృష్ణ ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ పంపిన ప్రధాన స్మగ్లర్‌ వంశ్‌ టక్కర్‌పై పోలీసులు దృష్టిసారించారు. ఇప్పటికే వైద్యురాలు నమ్రత, బాలకృష్ణ ఫోన్లను సీజ్‌ చేసిన పోలీసులు డేటాను విశ్లేషించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెల్లడైనట్టు తెలిసింది.


వంశ్‌ టక్కర్‌ హైదరాబాద్‌లో పెద్దఎత్తున నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడని.. బడా బాబులు, సంపన్నవర్గాల వారి పిల్లలు, హైప్రొఫైల్‌ ఐటీ ఉద్యోగులతో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు నడుపుతున్నట్లు సమాచారం. వారు ఆ గ్రూపుల ద్వారా డ్రగ్స్‌ ఆర్డర్‌ చేస్తుంటే.. డెలివరీ బాయ్‌లతో పంపుతున్నట్లు తెలిసింది. వాట్సాప్‌ గ్రూపుల్లోని వారితో పోలీసులు జాబితాను సిద్ధం చేసి వారందరికీ నోటీసులిచ్చి విచారించే అవకాశమున్నట్లు సమాచారం. వంశ్‌ టక్కర్‌ అరెస్టుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

Updated Date - May 11 , 2025 | 05:55 AM