ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: చికెన్‌ చాక్లెట్‌.. అగ్వకు ఎనీమియా టెస్ట్‌!

ABN, Publish Date - Apr 23 , 2025 | 04:44 AM

చికెన్‌ తినాలనిపిసిస్తే ప్రత్యేకంగా వండుకోనవసరం లేదు. షాపుకెళ్లితే ఇన్‌స్టెంట్‌గా లభిస్తుంది. చాక్లెట్‌ ముక్కను ఎలాగైతే రేపర్‌ తీసేసి నోట్లో వేసుకుంటామో.. అలాగే చికెన్‌ ముక్కను నోట్లో వేసుకోవొచ్చు.

  • సీఎస్ఐఆర్ క్యాంప్‌సలో స్టార్టప్‌ కాంక్లేవ్‌.. హైదరాబాద్‌ 2025లో ఆకట్టుకుంటున్న స్టార్ట్‌పలు

  • 70కు పైగా స్టార్ట్‌పల ప్రతినిధుల హాజరు

  • రూ.100కే సికెల్‌సెల్‌ ఎనిమియా పరీక్ష

  • చాక్లెట్‌ మాదిరిగానే షాపులో దొరికే చికెన్‌పీ్‌స

  • మధుమేహ రోగుల కోసం ప్రత్యేక స్నాక్స్‌

  • కాంక్లేవ్‌ను ప్రారంభించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి జితేంద్రసింగ్‌

హైదరాబాద్‌సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): చికెన్‌ తినాలనిపిసిస్తే ప్రత్యేకంగా వండుకోనవసరం లేదు. షాపుకెళ్లితే ఇన్‌స్టెంట్‌గా లభిస్తుంది. చాక్లెట్‌ ముక్కను ఎలాగైతే రేపర్‌ తీసేసి నోట్లో వేసుకుంటామో.. అలాగే చికెన్‌ ముక్కను నోట్లో వేసుకోవొచ్చు. ఇవేకాదు.. అరటిబోదె గుజ్జుతో తయారైన శానిటరీ న్యాప్‌కిన్స్‌.. కేవలం రూ.100కే సికెల్‌సెల్‌ ఎనీమియా పరీక్ష.. తీరిగ్గా ఇంట్లో కూర్చుని పొలం వద్ద ఉన్న పంపుసట్‌ను ఆన్‌ చేయగలిగే రిమోట్‌కంట్రోల్‌ వ్యవస్థ.. ఇలా వినూత్న ఆవిష్కరణలకు వేదికైంది ఆ స్టార్టప్‌ కాంక్లేవ్‌!! శాస్త్ర పరిశోధనల పట్ల యువతరానికి అవగాహన, వ్యాపార పరంలో దూసుకుపోయేందుకు తోడ్పాటునందించేందుకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎ్‌సఐఆర్‌)కు చెందిన ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్‌జీఆర్‌ఐలు హైదరాబాద్‌లో స్టార్టప్‌ కాంక్లేవ్‌ హైదరాబాద్‌ 2025ను నిర్వహిస్తున్నాయి. రెండ్రోజులపాటు ఐఐసీటీలోని జెడ్‌ఎం స్కూల్‌ గ్రౌండ్‌ వద్ద జరగనున్న ఈ కాంక్లేవ్‌ను మంగళవారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయమంత్రి జితేంద్రసింగ్‌ ప్రారంభించారు. సీఎ్‌సఐఆర్‌కు చెందిన హైదరాబాద్‌లోని మూడు ల్యాబ్‌లు-ఇండియన్‌ ఇసిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)లతో అనుబంధం కలిగిన దాదాపు 70కి పైగా స్టార్ట్‌పలు తమ ఆవిష్కరణలను, పరిశోధనలను వెల్లడిస్తూ ఓ ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. ఈ స్టాల్స్‌ను ఓ సారి పరిశీలిస్తే..


అరటిబోదె గుజ్జుతోనూ శానిటరీ న్యాప్కిన్స్‌

మార్కెట్‌లో ఉన్న శానిటరీ ప్యాడ్స్‌ ఖర్చు ఎక్కువే! అయితే అతి తక్కువ ఖర్చుతో, అదీ పర్యావరణ హితమైన శానిటరీ ప్యాడ్స్‌ అందించేందుకు ఆకార్‌ ఇన్నోవేషన్స్‌ కృషి చేస్తోంది. అరటి బోదె గుజ్జుతో శానిటరీ ప్యాడ్స్‌ తయారుచేయడానికి సంస్థ సిద్ధమైంది. ప్రయోగాత్మక దశలో అపూర్వ విజయం సాధించిందని, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించి త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురానున్నామంటున్నారు సంస్థ ప్రతినిధి ఉత్కర్ష్‌. లీకేజీని ఆరేడు గంటలపాటు ఈ ప్యాడ్స్‌ అడ్డుకుంటాయని, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న శానిటరీ ప్యాడ్స్‌తో పోలిస్తే తక్కువ ధరకే అందించనున్నామని చెప్పారు

రూ.100కే సికెల్‌సెల్‌ ఎనీమియా పరీక్ష

ఒక్క రక్తపు చుక్కచాలు... అతి భయంకరమైన సికెల్‌సెల్‌ ఎనీమియా ను కనిపెట్టవచ్చు అనంటున్నారు. లైటెనింగ్‌ లైవ్స్‌ ఎల్‌ఎల్‌పీ వ్యవస్థాపకులు సీసీఎంబీ పూర్వ శాస్త్రవేత గిరిరాజ్‌ రతన్‌ చందక్‌. సికెల్‌సెల్‌ ఎనిమియాను ముందుగానే సమస్యను గుర్తిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుందని.. అతి తక్కువ ఖర్చుతో సికెల్‌సెల్‌ ఎనీమియా పరీక్ష చేసేందుకు కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. సికెల్‌ సెల్‌ బారిన పడ్డారా? వాహకాలుగా ఉన్నారా? లాంటివన్నీ కేవలం రూ.100తో నిర్థారించుకోవచ్చున్నారు. ఇప్పటి వరకూ చేసిన పరిశోధనలు 99 శాతంకు పైగా కచ్చితత్వంతో ఫలితాలందించాయని... భవిష్యత్తులో ఈ కిట్‌ ఖర్చును మరింత తగ్గించే దిశగా ప్రయోగాలు చేస్తున్నామని వివరించారు.


రిమోట్‌ పంపుసెట్‌ను ఆన్‌ చేయొచ్చు

రిమోట్‌తో టీవీ ఆన్‌ చేసినట్లు.. ఇంట్లో కూర్చొని, పొలం దగ్గర మోటారు ఆన్‌ చేయగలిగితే? బాగుంటుంది కదా! పల్లె సృజన సంస్థ కిసాన్‌ రిమోట్‌ను తీసుకువచ్చింది. దేశంలో మొట్టమొదటిసారిగా రిమోట్‌తో వ్యవసాయ పంపుసెట్‌ మోటర్‌ను నిర్వహించవచ్చునని చెబుతోంది.. దాదాపు కిలోమీటరున్నర దూరం నుంచే ఈ రిమోట్‌ను నియంత్రించవచ్చునని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ రిమోట్‌ను రూ.1900కే రైతులకు అందిస్తున్నామంటున్నారు.

చికెనే.. చాక్లెట్‌లా తినేయొచ్చు!

ఎవరికైనా అప్పటికప్పుడు చికెన్‌ ముక్క తినాలిపిస్తే? దుకాణానికి వెళితే చాక్లెట్‌ మాదిరిగా రేపర్‌ తీసి.. చికెన్‌ ముక్క నోట్లో పెట్టుకోగలిగితే? చికెన్‌ ప్రియులకు ఈ వెసులుబాటు త్వరలోనే రానుంది. చికెన్‌ ముక్క కొరకాలని మనసు పుడితే షాప్‌కు వెళ్లి చికెన్‌ ప్రీమియర్‌ మీట్‌ బార్‌ కొనుక్కొని తినేయొచ్చంటోంది ఇండీ మీట్‌ స్టార్టప్‌. ఐసీఏఆర్‌ నేషనల్‌ మీట్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ వద్ద తయారైన ఈ ఇండీ మీట్‌ ప్రొటీన్‌ బార్‌లో హిమాలయన్‌ వనమూలికలు, చిరుధాన్యాలు కూడా జోడించారు. వందశాతం స్వచ్ఛమైన చికెన్‌ మీట్‌తో స్మోక్డ్‌ చికెన్‌ కూడా అందిస్తున్నారు. ఈ చికెన్‌ షెల్ఫ్‌ లైఫ్‌ తక్కువే ఉంటుందేమోన్న అనుమానమూ అక్కర్లేదంటున్నారు సంస్థ కో -ఫౌండర్‌ సయానికా. ఆరు నెలలకు పైగానే నిల్వ ఉంటుందంటున్నారు ఆమె. 200 గ్రాముల చికెన్‌లెగ్‌ ఖరీదు రూ.249. అయితే, బోన్‌లె్‌స రూ.289 వసూలు చేస్తున్నారు. ప్రీమియం బార్‌ రూ.249కు అందిస్తున్నారు.


మధుమేహులకు సూపర్‌ స్నాక్స్‌

షుగర్‌ వచ్చిందంటే మనసుకు నచ్చింది తినలేం. ఒకరకంగా నోరు ఒకరకంగా కట్టేసుకోవాల్సిందే. ప్రత్యేకించి బయటకెళినప్పుడు ఆకలివేస్తే ఏదిపడితే అది తినలేం. ఇలాంటి పరిస్థితుల్లో మధుమేహులకు ఈ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సూపర్‌ఫుడ్స్‌ సంస్థ చక్కని స్నాక్స్‌ అందుబాటులోకి తెచ్చింది. నూనె లేకుండా తయారుచేసిన ఈ ఆహార పదార్ధాలు 100ు సహజమైనవి. పైగా ప్రొటీన్‌ ఎక్కువగా లభిస్తుంది. అందునా ఈ స్నాక్స్‌కు ఎలాంటి షుగర్స్‌ జోడించలేదు. నిల్వ ఉంచడం కోసం ఎలాంటి రసాయనాలూ జోడించలేదు. కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉండే ఈ స్నాక్స్‌ ఊబకాయులకు కూడా ఆరోగ్యం అందిస్తాయని అంటున్నారు. ఈ ప్యాక్‌లు రూ.249 నుంచి మొదలవుతాయి.

Updated Date - Apr 23 , 2025 | 04:44 AM