ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Revanth Reddy: సీఎం క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

ABN, Publish Date - Jul 08 , 2025 | 03:54 AM

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు చేసిన ఫ్రైవేటు ఫిర్యాదు ఆధారంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు తీర్పు వాయిదా వేసింది.

  • రేవంత్‌పై ప్రైవేటు కేసు పెట్టిన బీజేపీ నేత

హైదరాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు చేసిన ఫ్రైవేటు ఫిర్యాదు ఆధారంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. 2024 ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తివేస్తారని తప్పుడు ఆరోపణలు చేశారని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దీనిపై అమిత్‌షా మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఫేక్‌ వీడియోను వైరల్‌ చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ఆ కేసును కొట్టేయాలని దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై జస్టిస్‌ కే.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ కొనసాగించింది. రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదిస్తూ.. ఎన్నికల సందర్భంగా చేసే రాజకీయ ప్రసంగాలపై కేసులు పెట్టడం సరికాదన్నారు. బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది విజయ్‌కుమార్‌ వాదిస్తూ.. బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా రేవంత్‌ అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. రేవంత్‌పై దిగువ కోర్టులో విచారణ కొనసాగనివ్వాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పు రిజర్వు చేసింది.

హైదర్‌గూడలో ప్రభుత్వ భూమి కబ్జాపై నోటీసులు

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం ఉప్పర్‌పల్లి హైదర్‌గూడ సర్వే నెంబర్‌ 7లో రెండెకరాల ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని రంగారెడ్డి కలెక్టర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్‌ శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. అదే సర్వే నెంబర్‌లోని మరో 1200 గజాల స్థలాన్ని దొంగ పత్రాలతో స్వాధీనం చేసుకుని ప్రహరీ నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం సంబంధిత అధికారులకు నోటీసులు జారీచేసింది.

ఇవి కూడా చదవండి

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 03:54 AM