Share News

SSC JE 2025 Notification: జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం, అర్హతలు ఏంటంటే..

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:56 PM

గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త వచ్చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల 1340 జూనియర్ ఇంజనీరింగ్ (SSC JE 2025 Notification) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

SSC JE 2025 Notification: జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం, అర్హతలు ఏంటంటే..
SSC JE 2025 Notification

ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల JE 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1340 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ఈ పోస్టుల అప్లికేషన్ ప్రక్రియ మొదలుకాగా, చివరి తేదీ జూలై 21 వరకు ఉంది. అయితే వీటి కోసం అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏ విధంగా ఎంపిక చేస్తారు, జీతభత్యాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


అర్హత ప్రమాణాలు

  • సివిల్ ఇంజనీరింగ్ (BRO): సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా + రెండేళ్ల పని అనుభవం

  • ఎలక్ట్రికల్ & మెకానికల్ (BRO): ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా + రెండేళ్ల అనుభవం

  • CPWD (సివిల్/ఎలక్ట్రికల్): సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా

  • CWC (సివిల్/మెకానికల్): సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా

  • ఇతర డిపార్ట్‌మెంట్లు: సంబంధిత డిసిప్లిన్‌లో డిప్లొమా లేదా డిగ్రీ


వయస్సు ఎంత ఉండాలి..

30 ఏళ్ల వరకు: ఈ పోస్టుల కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు జనవరి 2, 1996 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించి ఉండాలి

32 ఏళ్ల వరకు (CPWD పోస్టులకు): జనవరి 2, 1994 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించి ఉండాలి

వయస్సు సడలింపు

  • SC/ST: 5 సంవత్సరాలు

  • OBC: 3 సంవత్సరాలు

  • PwD: 10 సంవత్సరాలు

  • PwD + OBC: 13 సంవత్సరాలు

  • PwD + SC/ST: 15 సంవత్సరాలు

  • ఎక్స్ సర్వీస్‌మెన్: 3 సంవత్సరాలు (సైనిక సేవ తీసివేసిన తర్వాత)


SSC JE 2025 ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: జూలై 21, 2025 (రాత్రి 11 గంటల వరకు)

  • దరఖాస్తుల సవరణ : జూలై 22, 2025 (రాత్రి 11 గంటల వరకు)

  • SSC JE టైర్ 1 పరీక్ష తేదీ: అక్టోబర్ 27 నుంచి 31, 2025 వరకు

డిపార్ట్‌మెంట్ల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు

  • బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO): సివిల్, ఎలక్ట్రికల్ & మెకానికల్

  • బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి: సివిల్

  • సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC): సివిల్, మెకానికల్

  • సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD): సివిల్, ఎలక్ట్రికల్

  • ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి: సివిల్, ఎలక్ట్రికల్

  • మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES): సివిల్, ఎలక్ట్రికల్ & మెకానికల్

  • నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO): సివిల్

  • సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్: సివిల్, ఎలక్ట్రికల్

  • DGQA-NAVAL, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్: ఎలక్ట్రికల్, మెకానికల్


ఎంపిక ప్రక్రియ

  • SSC JE ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి

  • మొదట పేపర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (200 మార్కులు)

  • పేపర్ 2: జనరల్ ఇంజనీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్): 100 ప్రశ్నలు, 300 మార్కులు

  • ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తీసుకుంటారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

SSC JE 2025కు అప్లై చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగా, జూలై 21, 2025 వరకు అప్లికేషన్లను సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పణ పూర్తైన తర్వాత, సవరణల కోసం జూలై 22, 2025న ఒక రోజు వెబ్‎సైట్ విండో అందుబాటులో ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు, సంస్థలలో ఉద్యోగం పొందనున్నారు. ఈ ఉద్యోగాలు గ్రూప్ B (నాన్-గెజిటెడ్) కేటగిరీకి చెందినవి. వీటి జీత భత్యాల విషయానికి వస్తే, కేంద్ర 7వ వేతన స్కేల్ ప్రకారం రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు లభిస్తుంది.


ఇవి కూడా చదవండి

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 07 , 2025 | 04:20 PM