ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: సీఎంగారూ.. రంజాన్‌ తోఫాలు ఏవండీ..

ABN, Publish Date - Mar 29 , 2025 | 10:54 AM

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు కనీసం రంజాన్‌ తోఫాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని మాజీమంత్రి తన్నీరు హరీష్‏రావు విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహిళలకు బతుకమ్మ చీరెలు, ముస్లింలకు రంజాన్‌ తోఫాలు కూడా ఇవ్వలేదన్నారు.

- ముస్లింలను విస్మరించిన ప్రభుత్వం

- మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: రంజాన్‌ మాసంలో కేసీఆర్‌ ప్రభుత్వం తోఫాలు ఇస్తూ ముస్లిం కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. కానీ, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం ముస్లింలకు తోఫాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి హరీష్‏రావు(Harish Rao) అన్నారు. ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ లేక్‌వ్యూ బంజారాలో శుక్రవారం ఇఫ్తార్‌ విందు ఇచ్చారు.

ఈ వార్తను కూడా చదవండి: New software: ఆన్‌లైన్‌ మోసాలకు ఇక అడ్డుకట్ట..


ముఖ్య అతిథులుగా మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ, మాజీ మంత్రి హరీష్‏రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ముస్లిం సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఇఫ్తార్‌లు ప్రజల మధ్య ఉన్న మత సామరస్యానికి ప్రతీకలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి, స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్‌ గద్దలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు..

పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 29 , 2025 | 10:55 AM