ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హైటెక్‌ సిటీలో గూగుల్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌ సెంటర్‌

ABN, Publish Date - Jun 19 , 2025 | 03:54 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్‌ తన సేఫ్టీ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను (జీఎ్‌సఈసీ) నగరంలో నెలకొల్పింది.

  • ఆసియా పసిఫిక్‌లో మొదటిది.. ప్రపంచంలో ఐదో కేంద్రం

  • ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్‌ తన సేఫ్టీ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను (జీఎ్‌సఈసీ) నగరంలో నెలకొల్పింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే ఇది మొట్టమొదటి జీఎ్‌సఈసీ కాగా.. ప్రపంచంలో ఐదో కేంద్రం. హైటెక్‌ సిటీలోని దివ్యశ్రీ బిల్డింగ్‌లో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అధునాతన సైబర్‌ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్‌ ఈ సైబర్‌ సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు గర్విస్తున్నానని తెలిపారు.

‘‘గూగుల్‌, హైదరాబాద్‌ పాత ేస్నహితులు’’ అని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్‌.. 2007లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో గూగుల్‌ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. కాగా, ఈ కేంద్రం హైదరాబాద్‌ ఐటీ రంగాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 19 , 2025 | 03:54 AM