ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mylar Devupalli: మూడంతస్తులకు మంటలు.. పొగ

ABN, Publish Date - May 19 , 2025 | 03:56 AM

విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మైలార్‌ దేవుపల్లి మొగల్స్‌ కాలనీ ప్రాంతంలోని మూడంతస్తుల ఇంట్లో మంటలు, పొగలు చెలరేగాయి.

  • షార్ట్‌సర్క్యూట్‌తో ఘటన.. 50 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

రాజేంద్రనగర్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మైలార్‌ దేవుపల్లి మొగల్స్‌ కాలనీ ప్రాంతంలోని మూడంతస్తుల ఇంట్లో మంటలు, పొగలు చెలరేగాయి. మొగల్స్‌ కాలనీకి చెందిన షేక్‌ మాజిద్‌(45) మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. మాజిద్‌తో పాటు మరో ఏడు కుటుంబాలు ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని విద్యుత్తు మీటర్ల వద్ద షాట్‌ సర్క్యూట్‌ అయింది. దీంతో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఇంటి యజమానికి చెందిన పాత ఫర్నిచర్‌తో పాటు ఇతర వ్యర్థాలకు మంటలు వ్యాపించాయి.


మంటలు ఎగసిపడుతుండడంతో పాటు పొగ కమ్ముకోవడంతో మూడు అంతస్తుల్లోని దాదాపు 50 మంది చిన్న, పెద్దలు బయటికి వచ్చేందుకు మార్గం లేకుండా పోయింది. దీంతో వారంతా టెర్రస్‌ పైకి వెళ్లారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అప్పటికే పాతబస్తీలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లడంతో విషయాన్ని చాంద్రాయణగుట్ట అగ్నిమాపక కేంద్రానికి తెలిపారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి, టెర్ర్‌సపైన ఉన్న 50 మందిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై మైలార్‌ దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన

Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత

For Telangana News And Telugu News

Updated Date - May 19 , 2025 | 03:56 AM