ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ కారు విజేతకు చెక్కు అందజేత

ABN, Publish Date - May 15 , 2025 | 04:46 AM

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కారును గెల్చుకున్న రైతు గుడిపూడి శ్రీనివాసరావుకు బుధవారం ఖమ్మం యూనిట్‌ కార్యాలయంలో చెక్కు అందజేశారు.

ఖమ్మం, మే 14 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ 22వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కారును గెల్చుకున్న రైతు గుడిపూడి శ్రీనివాసరావుకు బుధవారం ఖమ్మం యూనిట్‌ కార్యాలయంలో చెక్కు అందజేశారు. హైదరాబాద్‌లోని ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన కార్యాలయంలో గత నెల 11న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని డ్రా తీసి విజేతలను ప్రకటించారు. అందులో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రామాపురానికి చెందిన రైతు గుడిపూడి శ్రీనివాసరావును అదృష్టం వరించింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఖమ్మం ‘ఆంధ్రజ్యోతి’ యూనిట్‌ కార్యాలయంలో ఖమ్మం కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య చేతుల మీదుగా కారుకు సంబంధించిన నగదు చెక్కును అందజేశారు. శ్రీనివాసరావు, ఆయన సతీమణి నాగేంద్రలు కమిషనర్‌ చేతుల మీదుగా చెక్కును అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకుని రావడంలో ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక స్థానం ఉందన్నారు. పాఠకుల కోసం ‘ఆంధ్రజ్యోతి’ లక్కీ డ్రా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ ఖమ్మం బ్రాంచ్‌ మేనేజర్‌ తాళ్లూరి పుల్లారావు, సిబ్బంది పాల్గొన్నారు.


కారులేని లోటును ‘ఆంధ్రజ్యోతి’ తీర్చింది

‘మాది వ్యవసాయ కుటుంబం. మాకున్న పది ఎకరాలతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ఎప్పటినుంచో కారు కొనాలని అనుకుంటున్నా అది సాధ్యపడలేదు. ఇప్పుడు మాకు కారులేని లోటును ‘ఆంధ్రజ్యోతి’ తీర్చింది. లక్కీ డ్రాలో గెలుపొందినట్లు ఫోన్‌ వచ్చిన తర్వాత కారు బుక్‌ చేసుకున్నాం. గత మూడేళ్లుగా ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను చదువుతున్నాను. లక్కీ డ్రాలో రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవడం గొప్ప అనుభూతినిచ్చింది’

- విజేత శ్రీనివాసరావు, నాగేంద్ర


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:46 AM