ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Seetakka: ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం

ABN, Publish Date - Jul 31 , 2025 | 05:00 AM

ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు అందరినీ ఒకే కేటగిరీలో చేర్చి ఒకే రకమైన వేతనం ఇవ్వాలని, ప్రస్తుతం విధుల్లో ఉన్న

  • గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌కార్డుల జారీ: మంత్రి సీతక్క

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు అందరినీ ఒకే కేటగిరీలో చేర్చి ఒకే రకమైన వేతనం ఇవ్వాలని, ప్రస్తుతం విధుల్లో ఉన్న 7,111 మందికి సమాన వేతనం అమలుచేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆమెను బుధవారం కలిసిన ఫీల్డ్‌అసిస్టెంట్లు తమ సమస్యలను వినిపించారు. దీనిపై స్పందించిన సీతక్క.. ఫీల్డ్‌ అసిస్టెంట్లను స్థిరమైన కాల పరిమితి ఉద్యోగులుగా మార్చే అంశం, వేతనాల పెంపు తదితర న్యాయమైన, ఆర్థికపరమైన అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని సంబంధిత విభాగాలకు సూచించారు. అదేవిధంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, ఆరోగ్య బీమా, ఆరోగ్య కార్డులు మంజూరు చేస్తామన్నారు.

3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 3వ తేదీ వరకు తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొంటుందని పేర్కొంది. ఇక హైదరాబాద్‌లో పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి వర్షం, చినుకులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉదయం వేళ పొగమంచుతో కూడిన పరిస్థితులుంటాయని వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 05:00 AM