ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

చింత చిగురులో పోషక విలువలే కాదు.. ఔషద గుణాలు సైతం ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నాన్ వేజ్ చికెన్, మటన్, రొయ్యిలలో కంటే చింత చిగురులోనే మంచి పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

చింత చిగురును నాన్ వేజ్‌లో కలిపి కూరగా చేస్తారు. ఈ చిగురులోని పులుపు.. వంటకే రుచిని ఇస్తుంది.  

దీనిలో ఐరన్ కంటెంట్ ఉంటుంది. దీన్ని ఆహారంలో తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. చిన్న పిల్లలకు ఇది మంచి బలాన్ని అందిస్తుంది.

చింత చిగురులో కామెర్ల వ్యాధిని నయం చేసే గుణం ఉంది. అంటే చింత చిగురు నుంచి రసాన్ని తీసి.. దానిని పటిక బెల్లంతో కలిపి తాగితే కామెర్ల వ్యాధిని అదుపులోకి తీసుకు రావచ్చు.

చింత చిగురును ఆహారంలో తీసుకోవడంతో వాతం వల్ల వచ్చే సమస్యలు తగ్గతాయి. అలాగే మూల వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు సైతం తగ్గుతాయి.

చింత చిగురు.. నీటిలో మరిగించి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, గొంతు వాపు, గొంతులో మంట తదితర సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే చింత చిగురు తినడం వల్ల కడుపులో నులి పురుగులు నశిస్తాయి.

ఈ ఆకు తినడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. ఇతర అనారోగ్య సమస్యలతో శరీరం పోరాడుతుంది.

థైరాయిడ్ సమస్యతో బాధ పడే వారు చింత చిగురు తీసుకోవచ్చు. ఇది తినడం వల్ల థైరాయిడ్‌ను నియంత్రించ వచ్చు. అలాగే రక్తాన్ని సైతం  శుద్ధి చేస్తుంది.

చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొవ్వును తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దీంతో గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం తదితర సమస్యలు దరి చేరవు.