రోజు పెరుగు తినడం కాదు.. తాగితే  ఆ రోగాలన్నీ పరార్..

నిజానికీ పెరుగు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ,

పెరుగు అన్నంలో తినటం కంటే..పెరుగును తాగడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు.

పెరుగు తాగడం వల్ల అందులో ఉండే ప్రోబయోటిక్స్‌ నేరుగా శరీరానికి అందడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి.

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా పెంచేందుకు సహాయపడుతుంది.

మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలను నివారిస్తుంది.

ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని తేమగా చేసేందుకు అద్భుతమైన పాత్ర పోషిస్తుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది.

పెరుగులో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.