షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలు తగ్గించే సింపుల్ చిట్కా.. 

మునక్కాయలో ఉండే పోషకాలు.. మరే ఇతర కూరగాయాల్లో ఉండవంటారు. అందుకే వివిధ ప్రాంతాల్లో మునక్కాయను శాకాహారుల మాంసాహారంగా పిలుస్తారు. వీటిలోని పోషకాలు.. వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.

మునక్కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నింటిలో ఔషదగుణాలుంటాయి. 

వీటిలో విటమిన్ ఏ, సీ, ఇతోపాటు కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక శారీరక రుగ్మతలు ఈ మునగ వల్ల నయమవుతుంది.

శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఇది ఎంతో దోహదపడుతుంది.

మునగ చెట్టు ఆకులు, కాయలని కూరలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

మునక్కాడలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. డయాబెటీస్‌ ఉన్న వారికి ఇది చాలా మంచిది.

అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి మునక్కాయ చాలా మేలు చేస్తుంది. వీటిలో మెగ్నీషియం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తుంది.

మునగలో ఉండే పోషకాలు రక్తనాళాలలోని చెడు కొలస్ట్రాల్‌ పేరుకు పోకుండా చేస్తాయి. దీన్ని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

మునక్కాయ చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ ఎ, బి, ఫోలిక్ యాసిడ్ వంటి పలు పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు మొటిమలను తొలగించడానికి పని చేస్తాయి.

ములక్కాడ తినడం వల్ల థైరాయిడ్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. మునగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపు సమస్యలను దూరం చేస్తాయి.