ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త..

ఏసీలో ఎక్కువసేపు కూర్చుంటే ఆరోగ్యానికి ఎంత నష్టం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

రోజంతా ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండే వ్యక్తి ఎముకలు త్వరగా బలహీనపడతాయి.

తక్కువ ఉష్ణోగ్రతల్లో నిత్యం గడిపితే శరీర జీవక్రియ రేటు క్రమంగా మందగిస్తుంది.

ఎముకలు బలంగా ఉండటానికి క్రమం తప్పకుండా పాలు, పెరుగు, పనీర్, ఇతర పాల ఉత్పత్తులు తీసుకోవాలి.

పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు శరీరానికి కాల్షియం, ఇనుము, ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి.

ఎముకలు, కండరాలను బలంగా ఉండేందుకు రోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి.