Electricity: ఆ ఏరియాల్లో విద్యుత్ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..
ABN, Publish Date - May 17 , 2025 | 07:30 AM
హైదరాబాద్ నగరంలోని కొన్ని ఏరియాల్లో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి విద్యుత్ కోతలు ఉంటాయని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
- నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: చంపాపేట విద్యుత్ 11కేవీ ఫీడర్‌లో వివిధ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9:30గంటల నుంచి 11గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు డివిజన్ ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్(Division Transco AE Srinivas) తెలిపారు. ఫీడర్ పరిధిలోని సాయిరాంనగర్‌కాలనీ, శిఖరా ఎన్‌క్లేవ్, నాగార్జునకాలనీ, ఆర్టీసీకాలనీ, భానునగర్, కేశవనగర్, సింగరేణికాలనీ, రాఘవేంద్ర కాలనీలలో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: లాభాల ఆశ చూపి రూ.15.20 లక్షలు కాజేశారు..
11కేవీ శ్రీనివాసనగర్ ఫీడర్‌లో..
చంపాపేట విద్యుత్ సెక్షన్‌లోని 11కేవీ శ్రీనివాసనగర్ ఫీడర్‌లో శనివారం సాయంత్రం 3:30గంటల నుంచి 5గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఫీడర్ పరిధిలోని గ్రీన్‌పార్కుకాలనీ, శ్రీనివాసనగర్‌కాలనీ, సాయిరాంకాలనీ, తపోవన్‌కాలనీల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు.
11కేవీ లైన్‌లో..
11కేవీ రియల్ బేకరీ విద్యుత్ ఫీడర్‌లో శనివారం వివిధ మరమ్మతుల కారణంగా ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఫీడర్ పరిధిలోని ఉదయ్‌నగర్, పద్మానగర్, గాయత్రీనగర్ ఎక్స్‌రోడ్, మందమల్లమ్మ ఎక్స్‌రోడ్, కర్మన్‌ఘాట్, నిర్మలానగర్ కాలనీలలో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
Variety Recipes: నోరూరించే రాగి రుచులు
Gachibowli: రేవంత్ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద
సురేఖ తెగించి కమీషన్ మంత్రుల పేర్లు చెప్పాలి
భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు
Read Latest Telangana News and National News
Updated Date - May 17 , 2025 | 07:30 AM