Share News

Hyderabad: లాభాల ఆశ చూపి రూ.15.20 లక్షలు కాజేశారు..

ABN , Publish Date - May 17 , 2025 | 06:57 AM

పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపొతున్నారు. ఈ సైబర్ మోసాలపై అవగాహన లేని అమాయక ప్రజలు బలైపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి మొత్తం రూ.15.20 లక్షలు కాజేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిని మోసంచేసిన సైబర్ మోసగాడు ఈ మొత్తాన్ని కాజేశాడు.

Hyderabad: లాభాల ఆశ చూపి రూ.15.20 లక్షలు కాజేశారు..

హైదరాబాద్‌ సిటీ: స్టాక్‌ ట్రేడింగ్‌ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.15.20 లక్షలు కాజేశారు. పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి (46)ని వాట్సప్‌ ద్వారా కొందరు సంప్రదించారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. తాము సెబీ ద్వారా అనుమతులు పొందిన ‘‘ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌’’ సంస్థ ప్రతినిధులమని చెబుతూ స్టాక్‌ ట్రేడింగ్‌పై సలహాలు, సూచనలు అందించారు.

ఈ వార్తను కూడా చదవండి: Ghatkesar: నీ చెల్లిని నా దగ్గరకు పంపు!


city1.2.jpg

ముందుగా రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టించి లాభాలు చూపించారు. నమ్మకం కలిగిన ఉద్యోగి పలు దఫాలుగా రూ.15.20 లక్షలు పెట్టుబడి పేరుతో వివిధ ఖాతాల్లో డబ్బు జమ చేశాడు. ట్రేడింగ్‌ ఖాతాలో లాభం చూపుతున్నా, విత్‌డ్రా(Withdrawal) చేసుకునే అవకాశం లేదు. ఆ డబ్బు తీసుకోవాలంటే మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని చెప్పడంతో ఇదంతా సైబర్‌ మోసమని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

Variety Recipes: నోరూరించే రాగి రుచులు

Gachibowli: రేవంత్‌ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద

సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు

Read Latest Telangana News and National News

Updated Date - May 17 , 2025 | 06:57 AM