Ghatkesar: నీ చెల్లిని నా దగ్గరకు పంపు!
ABN , Publish Date - May 17 , 2025 | 04:42 AM
ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి ఆమె చెల్లిని తనతో పంపాలని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడో బీటెక్ విద్యార్థి. ఇది తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక చెల్లెలు ఆత్మహత్యాయత్నం చేసింది.
ప్రేమించిన బాలికకు యువకుడి బ్లాక్‌మెయిల్
లేదంటే ఫొటోలు బయటపెడతానని బెదిరింపులు
ఆత్మహత్యకు యత్నించిన బాలిక చెల్లెలు
నిందితుడిపై పోక్సో కేసు.. మేడ్చల్ జిల్లాలో ఘటన
ఘట్‌కేసర్ రూరల్, మే 16(ఆంధ్రజ్యోతి): ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి ఆమె చెల్లిని తనతో పంపాలని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడో బీటెక్ విద్యార్థి. ఇది తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక చెల్లెలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధిలో వెలుగుచూసింది. ఘట్‌కేసర్ మునిసిపాలిటీ అవుశాపూర్‌కు చెందిన గుర్రం అవినాశ్ రెడ్డి(20) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చౌదరిగూడలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్న అదే గ్రామానికి చెందిన బాలిక(16)తో ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి పరిచయమైంది. ప్రేమ పేరుతో వల వేశాడు.. అప్పటినుంచి ఇద్దరూ సన్నిహితంగా ఉంటూ కలిసి ఫొటోలు దిగారు. వీడియోలు తీసుకున్నారు. 15 రోజుల క్రితం అవినాశ్ రెడ్డి డబ్బులు అవసరం ఉన్నాయంటూ బాలికకు ఫోన్‌చేసి.. ఆమె చెల్లి (15)తో పంపించాలని డిమాండ్ చేశాడు. డబ్బులు తనవద్ద లేవని ఆ బాలిక చెప్పింది.
అయితే బంగారు ఆభరణాలైనా ఇచ్చి పంపించాలని.. లేదంటే తాము దిగిన వీడియోలు, ఫొటోలను వైరల్ చేస్తానని బాలికకు ఆ యువకుడు బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆ బాలిక చేసేది లేక ఇంట్లోని ఆరు తులాల బంగారు ఆభరణాలను తన చెల్లితో ఇచ్చి పంపించింది. తర్వాత అవినాశ్... బాలికకు ఫోన్ చేసి ఆమె చెల్లిని తన వద్దకు పంపాలని ఒత్తిడి చేశాడు. రెండ్రోజుల తర్వాత ఇంట్లో బంగారు అభరణాలు కనిపించకపోవడంతో ఇద్దరు కూతుళ్లను తల్లి మందలించింది. భయపడిపోయిన ఆ బాలిక చెల్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలికల తండ్రి ఘట్‌కేసర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అవినాశ్ రెడ్డిని అదపులోకి తీసుకొని బంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News