R. Krishnaiah: కొండా లక్ష్మణ్ బాపూజీనే తెలంగాణ జాతిపిత..
ABN, Publish Date - Jun 03 , 2025 | 09:17 AM
కొండా లక్ష్మణ్ బాపూజీనే తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని మించిన త్యాగాలు చేసిన వారు మరొకరు లేరని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
- ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని మించిన త్యాగాలు చేసిన వారు మరొకరు లేరని, ఆయన సేవలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జాతిపితగా బాపూజీని అధికారికంగా ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య(R. Krishnaiah)తో పాటు పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ వ్యవస్థాపక చైర్మన్ రాపోలు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జలదృశ్యంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
పలువురు ప్రముఖులు హాజరై బాపూజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తెలంగాణకు చెందిన కోట్లాది మంది బాపూజీని జాతిపితగా ప్రకటించాలని భావిస్తున్నారని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈవిషయమై ప్రభుత్వం చొరవ చూపి నిర్ణయం తీసుకోవాలని కోరారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీని జాతిపితగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబోధించడం గొప్ప విషయమని,
అది త్వరలో సాకారం కావాలని కోరారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ ప్రసంగించారు. ఓబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ప్రొఫెసర్ రియాజ్ బాలయ్య, ఓబీసీ మోర్చాఅధ్యక్షుడు ఆనంద్‌కుమార్ గౌడ్, ఉద్యమకారులు, బిసి, దళిత, గిరిజన, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే
రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి
Read Latest Telangana News and National News
Updated Date - Jun 03 , 2025 | 09:17 AM