ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Damodara Rajanarasimha: 4 రీజినల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కేంద్రాలు!

ABN, Publish Date - May 13 , 2025 | 04:55 AM

ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగే విధంగా వైద్యసేవల విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

  • ప్రతి జిల్లాకు క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ మొబైల్‌ వాహనం: దామోదర

పరిగి, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగే విధంగా వైద్యసేవల విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులను మరిచిపోయే విధంగా ప్రభుత్వాసుపత్రులను ఆధునికీకరించి, డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొదటగా 100 ఆస్పత్రులను మోడల్‌గా ఎంపిక చేసి, వాటి రూపురేఖలను మార్చేందుకు బ్రాండింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రెండో విడతలో అన్నీ ఆధునికీకరిస్తామని చెప్పారు. 30 వేల జనాభాకు ఒక పీహెచ్‌సీ, 5 వేల జనాభాకు ఒక సబ్‌సెంటర్‌ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.


సోమవారం వికారాబాద్‌ జిల్లా పరిగిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రికి ఆప్‌గ్రేడ్‌ చేసేందుకు రూ.27 కోట్లతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి దామోదర శంకుస్థాపన చేశారు. వికారాబాద్‌లో రూ.30 కోట్లతో నిర్మించిన 300 పడకల ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఏడాదిలో 6,956 నర్సింగ్‌ అధికారుల పోస్టులు భర్తీ చేశామని, త్వరలో మరో 2,300 పైగా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ ప్రక్రియ మరో నెలరోజుల్లో ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు దిశల్లో నాలుగు రీజినల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అదే విధంగా ప్రతి జిల్లాకు క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ మొబైల్‌ వాహనం సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్రంలో హైవేలపై కొత్తగా 100 ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కౌలు రైతులకు శుభవార్త..

అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..

భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..

For More AP News and Telugu News

Updated Date - May 13 , 2025 | 04:55 AM