CWC Meeting: తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఫాలో అవ్వాలి: సీడబ్ల్యూసీ
ABN, Publish Date - May 02 , 2025 | 08:10 PM
తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణనను కేంద్ర ప్రభుత్వం కూడా ఫాలో కావాలని సీడబ్ల్యూసీ సూచించింది. ఈ నేపధ్యంలోనే పెహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు పరిహారం మాత్రమే కాకుండా దీర్ఘకాలిక పునరావాసం కల్పించాలని డిమాండ్ చేసింది.
ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనను అభినందించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం చేసిన కులగణన గురించి సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వగా సీడబ్ల్యూసీ హర్షం వ్యక్తం చేసింది . తెలంగాణ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పూర్తి వివరాలతో కులగణనను నిర్వహించిందని, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్‌ని ఫాలో కావాలని సూచించింది. పౌర సమాజం సామాజిక కార్యకర్తలు వివిధ సామాజిక వర్గాల లీడర్లను ప్రక్రియలో భాగస్వాములు చేశారని, అధికారులతో అంతర్గత కసరత్తు కాకుండా బహిరంగంగా ప్రజల నుంచి వివరాలు సేకరించారని సీడబ్ల్యూసీ వివరించింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన పద్ధతిని కేంద్రం ఫాలో అవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గట్టిగా కోరుతోంది.
ఈ నేపథ్యంలోనే పెహల్గాం ఉగ్రదాడి మృతులకు సీడబ్ల్యూసీ సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాల బాధ.. మొత్తం దేశం బాధ అని పేర్కొంది. ఉగ్రదాడికి దేశం మొత్తం జవాబుదారీతనం అని, న్యాయం కోసం ఎదురు చూస్తోందని తెలిపింది. ఇది రాజకీయాలకు సమయం కాదని, పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పడానికి ఉగ్రవాదాన్ని నిర్ణయాత్మకంగా అరికట్టడానికి ఒక దేశంగా మన సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించాల్సిన సమయం అని వ్యాఖ్యానించింది.
ఉగ్ర దాడికి సూత్రధారులు, నేరస్థులు పూర్తి పరిణామాలను ఎదుర్కోవాలని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను ఒంటరిగా చేసి శిక్షించడానికి భారత ప్రభుత్వం దృఢంగా, వ్యూహాత్మక స్పష్టతతో అంతర్జాతీయ సమన్వయంతో వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతోంది. బాధితుల కుటుంబాలకు నిరంతర నైతిక, సంస్థాగత మద్దతు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు పరిహారం మాత్రమే కాకుండా..దీర్ఘకాలిక పునరావాసం, మానసిక మద్దతు కల్పించాలని డిమాండ్ చేసింది. భద్రత నిఘాలో తీవ్రమైన లోపాలకు కాలపరిమితితో కూడిన జవాబుదారీతనం ఉండాలని కూడా సీడబ్ల్యూసీ సూచించింది.
Also Read:
WFH or Leave: వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..
New low for Pakistan: పాక్ కు కొత్త అవమానం
Bathroom Funny Photo: బాత్‌రూమ్‌లో సీసీ కెమెరా.. దాని కింద ఏం రాశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Updated Date - May 02 , 2025 | 08:22 PM