New low for Pakistan: పాక్ కు కొత్త అవమానం
ABN , Publish Date - May 02 , 2025 | 08:05 PM
దాయాది దేశం పాకిస్థాన్ నీచపు బుద్దులు, వారి పనులు ఆ దేశాన్ని మరింత దిగజారుస్తున్నాయి. ఆర్మీ స్కూల్, ఆర్మీ సిబ్బంది సంక్షేమ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుని పాక్ హ్యాకర్లు తోకలు జాడించారు. అయితే.. భారత్ అన్నీ కట్ చేసి పంపింది.
New low for Pakistan: ఉగ్రవాదులను పందుల మందలా పెంచుతూ ఇప్పటికే ఎంతో అపఖ్యాతిని మూటగట్టుకున్న పాకిస్థాన్ మరో నీచపు పనిని తన చిట్టాపద్దులో వేసుకుంది. ఇది పాకిస్తాన్‌కు కొత్త అవమానమని అంతర్జాతీయంగా సైతం వార్తలు వస్తున్నాయి. ఇంతకీ దాయాదిదేశం తాజాగా చేసిన నికృష్టపు పనేంటంటే.. ఇండియన్ ఆర్మీ స్కూల్స్ లో చదివే పిల్లలు, మాజీ సైనికుల వివరాల కోసం ఆర్మీ వెబ్‌సైట్‌లపై పాకిస్తాన్ పెంపుడు మూక సైబర్ అటాక్ చేసింది. అయితే, ఈ సైబర్ దాడులను భారత్ అడ్డుకుంది.
"సైబర్ గ్రూప్ HOAX1337", "నేషనల్ సైబర్ క్రూ" అని పిలువబడే హ్యాకర్ గ్రూపులు, ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులను ఎగతాళి చేసే అభ్యంతరకరమైన కంటెంట్‌ను పెట్టేందుకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) నగ్రోటా, సుంజువాన్ వెబ్‌సైట్‌లపై దాడి చేశారు. అంతేకాదు, వాటిలోని సమాచారం తస్కరించేందుకు, ధ్వంసం చేయడానికి ప్రయత్నించాయి. పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న హ్యాకర్ గ్రూపులు అటు, గురువారం భారతీయ వెబ్‌సైట్‌లలోకి చొరబడటానికి అనేక విఫల ప్రయత్నాలు చేశాయి. పిల్లలు, మాజీ సైనికులు, సైనిక సంక్షేమ సేవలకు సంబంధించిన ప్లాట్‌ఫామ్‌లను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులను భారత సైబర్ భద్రతా బృందాలు త్వరగా అడ్డుకున్నాయని సమాచారం.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..