Congress: వంద కొడతాం.. బీఆర్‌ఎస్‌ను బొంద పెడతాం!
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:22 AM
వచ్చే ఎన్నికల్లో వంద కొడతాం.. బీఆర్‌ఎస్ పార్టీని బొంద పెడతాం.. ఇక నుంచి మా నినాదం ఇదే!’ అని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య వ్యాఖ్యానించారు.
ఇక నుంచి మా నినాదమిదే: ప్రభుత్వ విప్ బీర్ల
సీఎం రేవంత్‌తో కేటీఆర్‌కు పోలికా?: ఈరవత్రి
లోకేశ్‌తో రహస్య భేటీల మతలబేంటో?: సామా
కేటీఆర్ స్థాయికి అద్దంకి చాలు: గజ్జెల కాంతం
హైదారాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ‘వచ్చే ఎన్నికల్లో వంద కొడతాం.. బీఆర్‌ఎస్ పార్టీని బొంద పెడతాం.. ఇక నుంచి మా నినాదం ఇదే!’ అని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నేతలకు ఇంకా అహంకారం.. బలుపూ తగ్గలేదని విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఒక బచ్చా అని.. ఆయనతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చకు రావాలా అని ఆదివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడితే ఫాంహౌస్, గెస్ట్ హౌస్‌లకు పరిమితమైన వారితో సీఎం రేవంత్‌కు పోటీనా అని నిలదీశారు. దోచుకున్న డబ్బులు, పింక్ మీడియాతో కేటీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. సీఎం రేవంత్‌తో.. కేటీఆర్‌కు పోలిక ఏంటని ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ సవాళ్లకు తాను సరిపోతానన్నారు. ప్రెస్‌క్లబ్‌కు తానే వస్తానని, అన్ని అంశాలపైనా చర్చ పెడదామని చెప్పారు.
రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిన కల్వకుంట్ల కుటుంబానికి ఏ శిక్ష వేసినా తప్పు లేదన్నారు. ఓ వైపున ఏపీ సర్కారు చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో కేటీఆర్ రహస్య మంతనాలు జరుపుతున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో లోకేశ్‌తో పలుమార్లు కేటీఆర్ రహస్యంగా సమావేశమయ్యారన్నారు. ఎవరికి లబ్ధి చేకూర్చడానికి లోకేశ్‌తో భేటీ అయ్యారో కేటీఆరే చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ స్థాయికి సీఎం రేవంత్ అవసరం లేదని, తమ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావులు చాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. కేటీఆర్ ప్రెస్‌క్లబ్‌కు వస్తే ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమని చెప్పారు. ప్రజా సమస్యలపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడాలన్నారు.
కాంగ్రెస్ నేతలపై కేసులు ఎత్తేయాలి: వీహెచ్
బీఆర్‌ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం ఎత్తేయాలని ఆ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు కోరారు. ఇటీవల ఓ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఈ సూచన చేశారని గుర్తు చేశారు. అలాగే ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్లకు నామినేటెడ్, ఇతర పదవులు ఇవ్వాలన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఈనెల 15న కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిర్వహిస్తున్న భేటీకి ఆహ్వానం అందిందని.. దానికి హాజరవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు.
Also Read:
కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..
మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
For More Telangana News And Telugu News
Updated Date - Jul 07 , 2025 | 02:22 AM