Share News

Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..

ABN , Publish Date - Jul 06 , 2025 | 07:56 PM

మాజీ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంకు తెరవెనక కుట్రలు చేస్తుంది ఎవరో అర్థం అవుతుందన్నారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడేందుకు కేటీఆర్‌కు సిగ్గు ఉండాలని మండిపడ్డారు.

Sama Rammohan Reddy:  కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..
KTR And Sama Rammohan Reddy

హైదరాబాద్: ఏపీ మంత్రి నారా లోకేష్‌తో బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రసిడెంట్​ కేటీఆర్ రహస్య మంతనాలు జరుపుతున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం.. గోదావరి, కృష్ణాలో తెలంగాణ వాటా కోసం పోరాటం చేస్తుంటే, బనకచర్ల ప్రాజెక్టు ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మాజీ మంత్రి​ కేటీఆర్ మాత్రం ఏపీ మంత్రి నారా లోకేష్‌తో సీక్రెట్ మీటింగ్స్ జరిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌తో కేటీఆర్‌ రెండు సార్లు మంతనాలు జరిపారని ఆరోపించారు. ఆ రహస్య మంతనాలు ఎందుకు చేశారో.. ఎవరికి లబ్ది చేయడానికి చేశారో కేటీఆర్ సమాధానం చెప్పాలని సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.


ఈ విషయంపై కేటీఆర్​ స్పందించాలని, లోకేష్‌ను​ కలవలేదంటే అప్పుడు తాను వివరాలు బయటపెడతానని షాకింగ్ కామెంట్స్ చేశారు. తెరవెనక తెలంగాణ రాష్ట్రంకు కుట్రలు చేస్తుంది ఎవరో వీరి భేటితో అర్థం అవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కి కేటీఆర్ ప్రతిసవాళ్లు విసురుతున్నారని..అయితే, అన్ని అంశాలపై సోమవారం అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నష్టం కలిగి రైతులు చనిపోతే కనీసం పట్టించుకోలేదని, అలాంటిది ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడేందుకు సిగ్గు ఉండాలని కేటీఆర్‌పై సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.


Also Read:

మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

For More Telangana News

Updated Date - Jul 06 , 2025 | 07:56 PM