Bhatti Vikramarka: హైదరాబాద్‌కు రూ.13,954 కోట్లు
ABN, Publish Date - May 23 , 2025 | 05:04 AM
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన రూ.13,954 కోట్ల పనులను త్వరలో పట్టాలెక్కిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం
సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన రూ.13,954 కోట్ల పనులను త్వరలో పట్టాలెక్కిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నగరంలో మూడు ప్రాంతాల్లో మెట్రో విస్తరణకు రూ.19,579 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. గురువారం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సచివాలయంలో పాత బస్తీ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. రూ.7,400 కోట్లతో 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకురానున్నామని తెలిపారు.
యాకత్‌పురాలో 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి కావలసిన స్థలానికి తక్షణమే ఎన్‌వోసీ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. కాగా, నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి బ్యాంకర్లు సహకరించాలని భట్టి విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఈ పథకం మంజూరు పత్రాలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6,250 కోట్లు సబ్సిడీ రూపేణా ఇవ్వనుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేకుండా రూ.20 వేల కోట్లకుపైగా రుణాలు ఇచ్చామని, రానున్న నాలుగేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వనున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 23 , 2025 | 05:04 AM