MP Dharmapuri Arvind: రిజర్వేషన్లపై రేవంత్‌ది పనికిమాలిన రాజకీయం
ABN, Publish Date - Jul 24 , 2025 | 02:59 AM
బీసీ రిజర్వేషన్లపై పనికిమాలిన రాజకీయాలు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు.
రాజాసింగ్‌ను బహిష్కరించలేదు
ఆయనే రాజీనామా చేశారు: అర్వింద్
ఆయన మిస్డ్ కాల్ ఇస్తే మళ్లీ పార్టీ సభ్యుడేనని వ్యాఖ్య
న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లపై పనికిమాలిన రాజకీయాలు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత సుప్రీంకోర్టు తీర్పులను అధిగమించి రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వ వ్యూహం ఏంటో చెప్పాలన్నారు. ఓసీలకు బీసీ ప్రధాని మోదీ 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్టే, బీసీలకు సీఎం రేవంత్ రిజర్వేషన్లు సాధించి పెట్టాలన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ పరస్పర వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రశ్నించగా.. రాజకీయ పార్టీలలో నేతల మధ్య గొడవలు సాధారణమేనని, కాంగ్రె్‌సలో రాజగోపాల్‌రెడ్డి, కొండా మురళి, బీఆర్‌ఎ్‌సలో కవిత, కేటీఆర్ ఉదంతాలను ప్రస్తావించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీలో నేతల మధ్య సమస్యలను పరిష్కరించాలన్నారు. రాజాసింగ్ ఎక్కడున్నా ఆయనను గౌరవిస్తామని, రాజాసింగ్ రాజకీయ నాయకుడిని మించిన ఐడియాలాజికల్ మ్యాన్ అంటూ పొగడ్తలు కురిపించారు. రాజాసింగ్‌ను బీజేపీ బహిష్కరించలేదని, ఆయనే రాజీనామా చేశారని అన్నారు. తమ పార్టీ సభ్యత్వం కోసం ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆయన తిరిగి పార్టీలో సభ్యుడు అవుతారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 24 , 2025 | 02:59 AM