BJP: బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారు..
ABN, Publish Date - May 29 , 2025 | 08:25 AM
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
హైదరాబాద్: బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్(Congress) పార్టీ నాయకులు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని, ఇది ఏమాత్రం సబబు కాదని నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, బీజేపీ అధ్యక్షులు నరేంద్రచౌదరి, భిక్షపతియాదవ్, ప్రసాద్‌రాజు అన్నారు. గురువారం నిజాంపేట్ కార్పొరేషన్‌లో జైహింద్ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ స్వాగతిస్తున్నామన్నారు.
అయితే, ఇదే మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడనాకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా రాలేదని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా నిజాంపేట్ కార్పొరేషన్‌కు రాడడం, అది కూడా జాతీయ జెండానుపట్టుకొని, తిరంగా యాత్రలో పాల్గొనడానికి రావడం స్వాగతిస్తున్నామన్నారు.
కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కొందరు వక్ర బుద్ధితో బీజేపీ ఆపరేషన్ సిందూర్ విజయాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు బీజేపీపై విమర్శలు మాని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క
Read Latest Telangana News and National News
Updated Date - May 30 , 2025 | 02:54 PM