BJP: బీజేపీ నేతల ఆరోపణ.. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదు
ABN, Publish Date - Jun 24 , 2025 | 10:59 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో అధికారులు ప్రొటోకాల్‌కు తిలోదకాలు ఇస్తున్నారని నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్ ఆరోపించారు.
- అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో అధికారులు ప్రొటోకాల్‌కు తిలోదకాలు ఇస్తున్నారని నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్(Akula Shiva) ఆరోపించారు. ప్రజాప్రతినిధులను ప్రక్కన పెట్టి అధికార పార్టీకి చెందిన నాయకుల సహకారంతో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమవారం జరిగిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం డివిజన్, నిజాంపేట్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి ప్రాంతాల్లో కేవలం పార్టీ పదవులతో అధికారులను మచ్చిక చేసుకుంటూ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో అధికారులు ఫ్రొటోకాల్ పాటించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమలేశ్వరి, ఈశ్వర్‌రెడ్డి, చందు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఒకే అధికారితో ప్రజావాణి నిర్వహణ
నిజాంపేట్ కార్పొరేషన్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో ఉన్నతాధికారులు లేకుండా కేవలం ఒక వార్డు ఆఫీసర్‌తో కార్యక్రమం నిర్వహించారు. దీనిపై ఆకుల సతీష్ మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్, అధికారుల సమక్షంలో ఫిర్యాదులు తీసుకొని పరిష్కరించే విధంగా నిబంధనలు ఉన్నాయని, అయితే కమిషనర్ నిర్లక్ష్యం కారణంగా ఒక వార్డు అధికారితో ప్రజావాణి నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.దీనిపై కమిషనర్ జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి
Read Latest Telangana News and National News
Updated Date - Jun 24 , 2025 | 10:59 AM