Jajula Srinivas Goud: బీసీరిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు వద్దు!
ABN, Publish Date - Jul 11 , 2025 | 04:57 AM
బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు.
మంత్రి పొన్నంతో జాజుల
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం బీసీ సంఘాల నేతలతో కలిసి మినిస్టర్స్ క్వార్టర్స్‌లో పొన్నంకు వినతి పత్రం సమర్పించారు. రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి.. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని కోరారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి చేతులు దులుపుపోకుండా, రాజ్యాంగ భద్రత రావాలంటే తమిళనాడు తరహాలో.. రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని మంత్రికి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈనెల 21నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో.. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచడానికి కట్టుబడి ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్సై
రాయదుర్గం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): గృహహింస కేసు నుంచి తప్పించడానికిలంచం తీసుకుంటూ గచ్చిబౌలి ఎస్‌ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గచ్చిబౌలి మహిళా పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ వేణుగోపాల్.. గృహహింస కేసు నుంచి బాధితుడి తల్లి పేరును తొలగించాలంటే రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సదరు వ్యక్తి నుంచి ఎస్సై లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News
Updated Date - Jul 11 , 2025 | 04:57 AM