ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

ABN, Publish Date - Jun 17 , 2025 | 08:42 AM

జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కల్యాణం, రథోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్: జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌(In-charge Minister Ponnam Prabhakar) తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కల్యాణం, రథోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. కల్యాణం నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రి సోమవారం ఆలయం వద్ద సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమ్మవారి కల్యాణం తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు శానిటేషన్‌ కోసం అదనంగా సిబ్బందిని, మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలన్నారు.

ఉచిత తాగునీటి సరఫరా, అదనంగా వాటర్‌ ట్యాంకర్ల ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌(MLA Talasani Srinivas Yadav) మాట్లాడుతూ.. జోగినీలు, శివసత్తులకు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కలెక్టర్‌ హరిచందన, డీసీపీ విజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ సరళ, ఆలయ చైర్మన్‌ సాయిబాబాగౌడ్‌, ఈవో రవీందర్‌గౌడ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 17 , 2025 | 08:42 AM