Banakacherla Project: బనకచర్లపై ఉత్తమ్, కవిత తప్పుడు ప్రచారం: బక్కని
ABN, Publish Date - Jun 06 , 2025 | 04:13 AM
బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏ విధంగా నష్టమో వారు సమాధానం చెప్పాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
సముద్రంలో కలిసిపోతున్న నీటిని వాడుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. తెలంగాణలో టీడీపీ ఎదగకుండా జరుగుతున్న కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు దుష్ప్రచారం చేస్తున్నాయని బక్కని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Jun 06 , 2025 | 04:13 AM