Apple Stores Queue: ఐఫోన్ 17 సేల్ ప్రారంభం.. ఆపిల్ స్టోర్ల వద్ద భారీ క్యూలైన్
ABN, Publish Date - Sep 19 , 2025 | 10:45 AM
ఆపిల్ ఐఫోన్ 17 కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఈరోజు భారతదేశంలో iPhone 17 సిరీస్ అధికారికంగా ప్రారంభమైంది. దీంతో టెక్ ప్రియులు ఆపిల్ స్టోర్లకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
ఆపిల్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. తాజాగా ఆపిల్ విడుదల చేసిన iPhone 17 సిరీస్ కోసం దేశంలోని పలు నగరాల్లో అభిమానులు భారీగా క్యూ లైన్లలో (Apple Stores Queue) నిలబడి కొత్త ఫోన్లను దక్కించుకున్నారు. నేడు సెప్టెంబర్ 19న (శుక్రవారం) భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) వద్ద ఉన్న ఆపిల్ స్టోర్ ముందు తెల్లవారుజామున నుంచే భారీగా క్యూలైన్ కనిపించింది. ఇదే తరహాలో ఢిల్లీలోని సాకేత్ స్టోర్ వద్ద కూడా వినియోగదారులు భారీగా చేరుకున్నారు. వెలుగులోకి వచ్చిన వీడియోల్లో వినియోగదారులు లైన్లలో నిలబడి కొత్త ఫోన్ కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ముంబైకి చెందిన ఓ వినియోగదారు రాత్రి 12 గంటల నుంచే ఫోన్ కోసం లైన్లో నిలబడి దక్కించుకున్నట్లు తెలిపారు. iPhone 17 Pro Max మోడల్స్ కొనుగోలు చేశానని చెప్పారు. ఒకటి 256GB, మరొకటి 1TB వర్షన్.
ఆపిల్ ధరలు, వేరియంట్లు ఇవే
iPhone 17 ధరలు:
256GB – రూ. 82,900
512GB – రూ.1,02,900
iPhone 17 Pro ధరలు:
256GB – రూ.1,34,900
512GB – రూ.1,54,900
1TB – రూ.1,74,900
iPhone 17 Pro Max ధరలు:
256GB – రూ.1,49,900
512GB –రూ.1,69,900
1TB – రూ.1,89,900
2TB – రూ.2,29,900
ప్రీ-బుకింగ్స్ హాట్
ఈ సారి ఐఫోన్ 17 సిరీస్‌కు అనూహ్యమైన డిమాండ్ ఉంది. గత సంవత్సరం వచ్చిన iPhone 16తో పోలిస్తే, ఈసారి ప్రీ-బుకింగ్స్ గణనీయంగా పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా iPhone 17 Pro, Pro Max మోడల్స్‌కి అత్యధిక డిమాండ్ ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 19 , 2025 | 11:32 AM