ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gmail: జీమెయిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ABN, Publish Date - Dec 28 , 2025 | 09:31 AM

గూగుల్ జీమెయిల్‌లో కొత్త ఫీచర్ వచ్చింది. ఈమెయిల్ అడ్రస్ మార్చుకోవచ్చు. కొత్త అకౌంట్ అవసరం లేదు. ఇప్పటివరకు జీమెయిల్ అడ్రస్ మార్చడం అసాధ్యం. కానీ ఇప్పుడు గూగుల్ కొత్త ఫీచర్‌ను రోల్ అవుట్ చేస్తోంది.

Gmail email address change

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 28: మనదేశంలో 82 శాతానికి పైగా ప్రజలు జీ మెయిల్ వాడుతున్నారు. అంటే దాదాపు 120 కోట్ల మంది. అయితే, యూజర్లు ఎన్నో రోజులుగా చూస్తున్న జీ-మెయిల్‌ ఐడీని (యూజర్‌నేమ్‌) మార్చుకునే అవకాశాన్ని ఇప్పుడు తీసుకొచ్చింది. ఇంత వరకూ కొత్తగా ఇ-మెయిల్‌ ఐడీని క్రియేట్‌ చేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్‌ లేదు. దీనివల్ల పాత డేటా కోల్పోవడం ఇష్టం లేనివారు దాన్నే వాడుతున్నారు.

దీంతో ఇ-మెయిల్‌ ఐడీని మార్చుకునే వెసులుబాటును గూగుల్‌ తీసుకొచ్చింది. గూగుల్‌కు సంబంధించిన సపోర్ట్‌ పేజీలో ఈ ఆప్షన్‌ కనిపిస్తోంది. చివర్లో @జీమెయిల్‌.కామ్‌ అలానే ఉంటూ అడ్రస్‌ను మార్చుకోవచ్చన్నమాట. కొత్త ఇ-మెయిల్‌ ఐడీని ఎంచుకున్నప్పటికీ.. దాన్ని పాత అకౌంట్‌గానే గూగుల్‌ పరిగణిస్తుంది. పాత మెయిల్‌ ఐడీకి వచ్చిన ఫొటోలు, మెసేజులు, ఇ-మెయిల్స్‌ పోతాయన్న బాధ లేదు. అయితే, ఒకసారి గూగుల్‌ ఐడీ మార్చుకున్నాక మళ్లీ ఏడాది వరకు మార్చుకునే వెసులుబాటు ఉండదు.

అంతేకాదు, ఒక్కక్క యూజర్ మొత్తంగా మూడుసార్లు మాత్రమే ఇ-మెయిల్‌ ఐడీని మార్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఆప్షన్‌ అందరికీ అందుబాటులోకి రాలేదు. కొందరికి మాత్రమే ఈ ఆప్షన్‌ రోలవుట్‌ చేసినట్లు తెలుస్తోంది. రాను రాను అందరికీ ఈ అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..

పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..

Updated Date - Dec 28 , 2025 | 12:11 PM