Apple Event 2025: ఆపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 9న ఫిక్స్.. లైనప్‌లో ఏం ఉన్నాయంటే..
ABN, Publish Date - Aug 28 , 2025 | 02:51 PM
ప్రముఖ మొబైల్ సంస్థ ఆపిల్ వార్షిక ఈవెంట్ తేదీ ఖరారైంది. ఎప్పటిలా కాకుండా ఈసారి ఈవెంట్‌లో కొత్త iPhone 17 లైనప్, Apple Watch Ultra 3, ఇంకా AirPods Pro 3 వంటి పలు ఆసక్తికర గ్యాడ్జెట్లు లాంచ్ కానున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
టెక్ ప్రియులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే ఆపిల్ ప్రతి ఏడాది లాగే ఈసారి జరిగే గ్రాండ్ ఈవెంట్‌ని సెప్టెంబర్ 9న (Apple Event 2025) నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో టెక్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకునే కొత్త ప్రొడక్ట్స్ లైనప్‌తో వస్తోంది. ఐఫోన్ 17 సిరీస్, కొత్త ఆపిల్ వాచ్‌లు, ఎయిర్‌ప్యాడ్ ప్రో సహా అనేకం రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఐఫోన్ 17 సిరీస్
ఈ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించేది ఐఫోన్ 17 సిరీస్. దీని నుంచి ఈసారి నాలుగు మోడల్స్ రాబోతున్నాయి:
ఐఫోన్ 17
ఐఫోన్ 17 ప్రో
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
ఐఫోన్ 17 ఎయిర్ (కొత్త ప్లస్ లాంటి మోడల్)
సింగిల్ కెమెరా
ప్రధానంగా ఐఫోన్ 17 ఎయిర్ గురించి చాలా హైప్ ఉంది. ఇది ఆపిల్ చరిత్రలో అతి సన్నని ఐఫోన్, కేవలం 5-6 మిల్లీమీటర్ల మందం ఉంటుందని తెలుస్తోంది. 6.5 ఇంచ్ డిస్‌ప్లే, బ్యాటరీ కొంచెం చిన్నగా, 48MP రియర్ సింగిల్ కెమెరాతో వస్తుందని టాక్. అన్ని మోడళ్లలో 24MP సెల్ఫీ కెమెరా, 120Hz డిస్‌ప్లే ఉంటాయి. iOS 26తో లిక్విడ్ గ్లాస్ ఇంటర్‌ఫేస్, మెసేజెస్‌లో బెటర్ గ్రూప్ చాట్స్, మెరుగైన ఫొటోస్ యాప్ కూడా రాబోతున్నాయి. సాఫ్ట్‌వేర్, డిజైన్‌లో ఈ కొత్త అప్‌గ్రేడ్స్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని మరో స్థాయికి తీసుకెళ్తాయి.
ఆపిల్ వాచ్
ఆపిల్ వాచ్ లవర్స్‌కి కూడా గుడ్ న్యూస్. ఈ ఈవెంట్‌లో ఆపిల్ వాచ్ అల్ట్రా 3 హైలైట్ కాబోతోంది. 5G సపోర్ట్, శాటిలైట్ టెక్స్టింగ్, ఫాస్టర్ ప్రాసెసర్‌తో ఈ వాచ్ అడ్వెంచర్ లవర్స్‌కి పర్ఫెక్ట్. అంతేకాదు, ఆపిల్ వాచ్ సిరీస్ 11, కొత్త వాచ్ SE కూడా రావచ్చు. కానీ వీటిలో పెద్ద అప్‌గ్రేడ్స్ ఉండకపోవచ్చు.
ఎయిర్‌పాడ్స్ ప్రో 3
ఎయిర్‌పాడ్స్ ప్రో 3 గురించి కూడా బజ్ ఉంది. ఇవి హెల్త్ ఫీచర్స్‌తో వస్తాయని తెలుస్తోంది. ఇన్ ఇయర్ హార్ట్ రేట్, టెంపరేచర్ ట్రాకింగ్, iOS 26తో రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్స్ రాబోతున్నాయట. ఇవి నిజంగా లాంచ్ అయితే ఎయిర్‌పాడ్స్ లవర్స్‌కి మంచి ట్రీట్ అవుతుంది.
ఈ ఈవెంట్‌లో రానివి ఏంటి?
అన్ని ప్రొడక్ట్స్ ఈ ఈవెంట్‌లో రావు. ఫోల్డబుల్ ఐఫోన్ 2026 వరకు వస్తుందని చెప్పలేం. అలాగే, కొత్త మ్యాక్ బుక్స్, హోమ్‌పాడ్, ఆపిల్ టీవీ అప్‌డేట్స్ కూడా ఈ ఈవెంట్‌లో లేనట్లు తెలుస్తోంది. వీటిని 2025 చివర్లో చూడవచ్చు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 28 , 2025 | 03:45 PM