ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amazfit Bip 6: అమాజ్‌ఫిట్ నుంచి అదిరే స్మార్ట్‌వాచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, 26 రోజుల బ్యాటరీ లైఫ్‌

ABN, Publish Date - May 17 , 2025 | 06:09 PM

మంచి స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్న వారికి కీలక అలర్ట్ వచ్చింది. ఎందుకంటే ప్రముఖ సంస్థ అమాజ్‌ఫిట్ నుంచి బిప్ 6 స్మార్ట్‌వాచ్‌ మార్కెట్లోకి వచ్చేసింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 రోజుల వరకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఈ వాచ్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Amazfit Bip 6

టెక్ ప్రియులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ప్రముఖ కంపెనీ అమాజ్‌ఫిట్ భారతదేశంలో అధికారికంగా బిప్ 6 (Amazfit Bip 6) స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని స్పెషల్ ఏంటంటే 26 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ మోడల్ 1.97 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని గరిష్ట ప్రకాశం 2,000 నిట్‌ల వరకు ఉంటుంది. ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ సర్దుబాటు కోసం యాంబియంట్ లైట్ సెన్సార్‌ కూడా కలదు. అమాజ్‌ఫిట్ బిప్ 6ను కంపెనీ అనేక రంగులలో విడుదల చేసింది.


అమాజ్‌ఫిట్ బిప్ 6 ఫీచర్లు

బిప్ 6 ధృఢమైన అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్, స్పీకర్ ద్వారా బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 5 ATM (50 మీటర్లు) నీటి నిరోధక రేటింగ్‌ను అందిస్తుంది. ఇది IP68 రేటింగ్ కంటే మెరుగైనది. దీంతోపాటు ఇది ఐదు ఉపగ్రహ వ్యవస్థలకు సపోర్ట్ చేసే GPSతో అమర్చబడి ఉంది. ఇంకా దీనిలో హైరాక్స్ రేస్, స్మార్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్, పర్సనలైజ్డ్ AI కోచింగ్ వంటి 140కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి.


ఇతర లక్షణాలు..

బయోట్రాకర్ PPG బయోమెట్రిక్ సెన్సార్ (రక్త-ఆక్సిజన్, 5PD + 2LEDకి సపోర్ట్ చేస్తుంది), 24 గంటల హృదయ స్పందన రేటు, SpO2, ఒత్తిడి పర్యవేక్షణ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు క్యాలెండర్ రిమైండర్, కాల్ నోటిఫికేషన్, స్మార్ట్‌ఫోన్ యాప్ నోటిఫికేషన్, మ్యూజిక్, కెమెరా నియంత్రణ వంటివి ఉన్నాయి. దీని బరువు 27.9 గ్రాములు (పట్టీ లేకుండా) కాగా, 340mAh బ్యాటరీ, సాధారణ వాడకంతో 14 రోజుల వరకు వస్తుంది. ఎక్కువగా వినియోగిస్తే 6 రోజుల వరకు, బ్యాటరీ సేవర్ మోడ్‌లో 26 రోజుల వరకు వస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.


దీని ధర ఎంత ఉందంటే..

ఇండియాలో Amazfit BIP6 ధర రూ. 7,999 కాగా, మే 16 నుంచి Amazfit అధికారిక వెబ్‌సైట్ Amazon India, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ నాలుగు (బ్లాక్, ఎరుపు, చార్ కోల్, ముదురు తెలుపు) రంగులలో అందుబాటులో ఉంది.


ఇవి కూడా చదవండి

Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..

YouTuber leaks to Pakistan: పాకిస్థాన్‌కు సమాచారం.. మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురు అరెస్టు..

Intraday Trading: స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో ఎంత మంది నష్టపోతున్నారో తెలుసా..


Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 06:13 PM