Share News

YouTuber leaks to Pakistan: పాకిస్థాన్‌కు సమాచారం.. మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురు అరెస్టు..

ABN , Publish Date - May 17 , 2025 | 04:22 PM

దేశంలోనే ఉంటూ శత్రుదేశానికి కీలక రహస్యాలు చేరవేసిన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో హర్యానా నుంచి పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రముఖ యూట్యూబర్, బ్లాగర్ జ్యోతి మల్హోత్రాతోపాటు ఆరుగురు భారతీయులు అరెస్టయ్యారు.

YouTuber leaks to Pakistan: పాకిస్థాన్‌కు సమాచారం.. మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురు అరెస్టు..
Haryana YouTuber Jyoti Malhotra Arrested

హర్యానా: ఇండియాలోనే ఉంటూ మన శత్రుదేశమైన పాకిస్థాన్‌కు పలువురు కీలక సమాచారం చేరవేశారు. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై హర్యానాకు చెందిన మహిళా యూట్యూబర్ (YouTuber leaks to Pakistan), బ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో సహా ఆరుగురు భారతీయ పౌరులను అరెస్టు చేశారు. జ్యోతి 'ట్రావెల్ విత్ జో' అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఆమె లీక్ చేసి పాకిస్థాన్‌కు పంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.


గతంలో వెళ్లి..

అయితే జ్యోతి 2023లో పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడ పాకిస్థాన్‌ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో పరిచయం ఏర్పరచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. డానిష్ ఆమెను పాకిస్థాన్ నిఘా ఏజెంట్లకు పరిచయం చేశాడు. ఆ క్రమంలో ఆమె ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా వారితో సంబంధాలు కొనసాగించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పంజాబ్‌లోని మాలెర్‌కోట్లాకు చెందిన ఇద్దరు వితంతువులు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. భారత సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రదేశాల గురించి సమాచారాన్ని పాకిస్థాన్ పంపినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.


మనీ, మ్యారేజ్ ఆశతో..

పాకిస్థాన్ ఏజెంట్లు వీరికి డబ్బు ఆశ చూపించి వలలో వేసుకున్నారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాలలో పెళ్లి కూడా చేసుకుంటామని తప్పుడు వాగ్దానాలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులందరినీ విచారిస్తున్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీరి గురించి తెలిసింది.


పహల్గామ్‌ దాడి తర్వాత..

ఏప్రిల్ 22, 2025న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడులు చేసి 26 మంది అమాయకులను కాల్చి చంపారు. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ద్వారా రివేంజ్ తీర్చుకుంది. ఆ క్రమంలో పాకిస్థాన్‌లోని అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 40 మంది పాకిస్థాన్ సైనికులు, 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..

Intraday Trading: స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో ఎంత మంది నష్టపోతున్నారో తెలుసా..


Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 05:02 PM