Share News

Intraday Trading: స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో ఎంత మంది నష్టపోతున్నారో తెలుసా..

ABN , Publish Date - May 16 , 2025 | 09:06 PM

ప్రతిరోజు ఉదయం 9.15కు స్టాక్ మార్కెట్ బెల్ మోగగానే ఇన్వెస్టర్లు సిద్ధమవుతారు. లాభాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే అసలు ఇంట్రాడే ట్రేడింగ్ (Intraday Trading) వల్ల ఎంత మంది లాభాలు పొందుతున్నారు, ఎంత మంది నష్టపోతున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Intraday Trading: స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో ఎంత మంది నష్టపోతున్నారో తెలుసా..
intraday trading loss statistics

స్టాక్ మార్కెట్ (stock market) కొంత మందికి కాసుల వర్షాన్ని కురిపిస్తే, మరికొంత మందికి మాత్రం నష్టాలను అందిస్తుంది. సాధారణంగా ఇంట్రాడే ట్రేడింగ్‌లో(Intraday Trading) రోజూ లక్షల మంది ఇన్వెస్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ నుంచి లాభాలను రాబట్టాలని ప్రయత్నిస్తుంటారు. అయితే అసలు ఈ ట్రేడింగ్‌లో ఎంత శాతం మంది లాభాలు పొందుతున్నారు, ఒక్క రోజులో ఎంత మంది తమ పెట్టుబడులను కోల్పోతున్నారనే విషయాలను తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.


లాభాలు పొందేవారు కేవలం..

సెబీ నివేదికల ప్రకారం 2021-22లో ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఇంట్రాడే ట్రేడర్లలో కేవలం 10-15% మంది మాత్రమే లాభాలు ఆర్జించారు. మిగిలినవారు నష్టాలను చవిచూశారు. ఈ నష్టాలకు అనుభవం లేకపోవడం, భావోద్వేగ నిర్ణయాలు, మార్కెట్ అస్థిరత వంటివి అనేక కారణాలు ఉన్నాయి. మరికొన్ని నివేదికలు మాత్రం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 80 నుంచి 90% మంది ట్రేడర్లు నష్టపోతున్నారని చెబుతున్నాయి. అంటే ఈ లెక్కన స్టాక్ మార్కెట్ ఇంట్రాడే నుంచి సంపాదించేది మాత్రం దాదాపు 10 శాతం మంది మాత్రమేనని చెప్పవచ్చు. అంటే మిగిలిన 90 శాతం మంది ఇన్వెస్టర్లు కూడా వారి డబ్బులను పొగొట్టుకుంటున్నారు.


గత రిపోర్టులు కూడా..

గత అధ్యయనాలు కూడా (ఉదా SEBI 2019-2020 నివేదికలు) ఇంట్రాడే ట్రేడింగ్‌లో చాలా తక్కువ మంది ట్రేడర్లు (సుమారు 10-20% మంది) స్థిరమైన లాభాలు సాధించారని తెలిపింది. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది అధిక రిస్క్‌తో కూడిన కార్యకలాపం. దీనిలో విజయం సాధించడానికి మార్కెట్ జ్ఞానం, అనుభవం, కఠినమైన వ్యూహాలు అవసరం. లాభం పొందే ట్రేడర్లలో చాలా మంది ప్రొఫెషనల్ లేదా అనుభవజ్ఞులైన ట్రేడర్లు ఉంటారని చెబుతున్నారు. వీరు టెక్నికల్ విశ్లేషణ, స్టాప్-లాస్ వ్యూహాలు, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తారని నిపుణులు అంటున్నారు.


నష్టపోయే వారిలో..

SEBI నివేదిక ప్రకారం కొత్త ట్రేడర్లు ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపింది. ఎందుకంటే వారు తరచుగా మార్కెట్ ఒడిదొడుకులను అర్థం చేసుకోకుండా, రిస్క్ మేనేజ్‌మెంట్ లేకుండా ట్రేడ్ చేస్తున్నారని వెల్లడించింది. మార్కెట్ నష్టాలకు అధిక లివరేజ్, అత్యాశ, స్టాక్ మార్కెట్లో ఊహించని మార్పులు వంటివి కూడా ప్రధాన కారణాలుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 2025లో భారత స్టాక్ మార్కెట్ బలమైన వృద్ధిని చూపిస్తోంది. ఈ పరిస్థితి లాభావకాశాలను పెంచవచ్చు. కానీ ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ స్వభావం మాత్రం మారదు. కాబట్టి ట్రేడింగ్ చేయాలని చూస్తున్న వారు మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలు సహా అనేక అంశాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.


ఇవి కూడా చదవండి

Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్


Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..


NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..


Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 09:06 PM