Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
ABN , Publish Date - May 16 , 2025 | 03:44 PM
స్టాక్ మార్కెట్లో పలువురు ఇన్వెస్టర్లు పెన్నీ స్టాక్స్ గురించి సరిగా పట్టించుకోరు. కానీ కరెక్ట్ అనాలసిస్ చేసి మంచి కంపెనీ స్టాక్ ఎంచుకంటే మాత్రం దీర్ఘకాలంలో భారీ మొత్తాలను పొందవచ్చు. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

స్టాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్ అంటే.. తక్కువ ధరల్లో ఉండే స్టాక్స్. కానీ సరైన వాటిని ఎంచుకుని పెట్టుబడులు చేస్తే మాత్రం మంచి లాభాలను పొందవచ్చు. వీటిలో కొంత రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం భారీ మొత్తాలను పొందవచ్చు. చిన్న పెట్టుబడితోనే అధిక మొత్తాలను పొందటం వీటి ప్రత్యేకత. ఇక్కడ కూడా ఓ పెన్నీ స్టాక్ (Penny Stock) విషయంలో అలాగే జరిగింది. కేవలం ఐదేళ్లలోనే ఓ స్టాక్ ఏకంగా రూ. 15 నుంచి రూ. 246కి చేరుకుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు ఏకంగా 1500 శాతం రాబడులను అందించడం విశేషం. ఆ కంపెనీ ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారీ లాభం..
ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్ (Artemis Medicare Services) స్టాక్ గత ఐదేళ్లలో అద్భుతమైన ప్రదర్శనతో ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది. 2020 మేలో ఈ స్టాక్ ధర కేవలం రూ.15గా ఉండగా, 2025 నాటికి ఇది రూ.246కి చేరుకుంది. ఈ క్రమంలో 2020 మేలో ఈ కంపెనీ స్టాక్స్ రూ. 15 చొప్పున 25 వేలు కొనుగోలు చేసి (రూ.3,75,000) ఇప్పటివరకు ఉంచిన వారికి మంచి లాభాలు వచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.246కి (మే 16, 2025) చేరుకుంది. అంటే ఒక్క స్టాక్‌పై 231 రూపాయలు లాభం, ఈ లెక్కన 25 వేల స్టాక్స్ నుంచి వచ్చిన లాభం రూ.57,75,000. ఈ నేపథ్యంలోనే దాదాపు 4 లక్షల పెట్టుబడి చేసి ఐదేళ్లలోనే 15 రెట్ల లాభం పొందారని చెప్పవచ్చు.
ఈ కంపెనీ స్పెషల్ ఏంటంటే..
ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో ఒక ప్రముఖ సంస్థగా ఉంది. ఇది ఆసుపత్రుల నిర్వహణ, డయాగ్నస్టిక్ సేవలు, వైద్య సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ అవసరాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్టెమిస్ తన నాణ్యమైన సేవలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ రోగులకు అధునాతన వైద్య సౌకర్యాలను అందించడమే కాకుండా, ఆర్థికంగా కూడా స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది.
కరోనా సమయంలో..
2020లో ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్ స్టాక్ ధర రూ.15 వద్ద ఉండేది. ఆ సమయంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆరోగ్య సంరక్షణ రంగంపై ఒత్తిడి ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ, ఈ సంక్షోభ సమయంలో ఆర్టెమిస్ తన సేవలను విస్తరించడం ద్వారా బలమైన పునాదిని నిర్మించుకుంది. ఆసుపత్రుల సామర్థ్యాన్ని పెంచడం, అత్యవసర వైద్య సేవలను అందించడం, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి వ్యూహాత్మక నిర్ణయాలు సంస్థకు గణనీయమైన లాభాలను తెచ్చిపెట్టాయి. కరోనా తర్వాత 2021 నాటికి, ఆరోగ్య సంరక్షణ రంగంపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడంతో ఆర్టెమిస్ స్టాక్ ధర క్రమంగా పెరగడం ప్రారంభమైంది.
ఇవి కూడా చదవండి
NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి