ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Best Female Football Player: ఉత్తమ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి సౌమ్య

ABN, Publish Date - May 03 , 2025 | 04:37 AM

జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్‌) వార్షిక అవార్డుల్లో నిజామాబాద్‌ క్రీడాకారిణి గుగులోతు సౌమ్య ఉత్తమ క్రీడాకారిణి అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డును గెలిచిన తొలి తెలంగాణ క్రీడాకారిణిగా సౌమ్య నిలిచింది.

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్‌) వార్షిక అవార్డుల్లో నిజామాబాద్‌ అమ్మాయి గుగులోతు సౌమ్యకు ఉత్తమ క్రీడాకారిణి పురస్కారం లభించింది. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ క్రీడాకారిణి సౌమ్యనే కావడం విశేషం. శుక్రవారం భువనేశ్వర్‌లో జరిగిన 2024 ఏఐఎఫ్‌ఎఫ్‌ వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో సౌమ్య ఈ పురస్కారాన్ని అందుకుంది. ఐడబ్ల్యూఎల్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు తరఫున తొమ్మిది గోల్స్‌తో టాప్‌ స్ట్రయికర్‌గా నిలిచిన సౌమ్య.. గతేడాది జరిగిన అంతర్జాతీయ పోటీల్లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించినందుకుగాను ఈ అవార్డు వరించింది. పురుషుల విభాగంలో సుభాషిష్‌ బోస్‌ ఉత్తమ ప్లేయర్‌ అవార్డు అందుకున్నాడు.

Updated Date - May 03 , 2025 | 04:38 AM