ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PBKS VS LSG: పంజాబ్ vs లక్నో మ్యాచులో గెలిచిదేవరు..ఇరు జట్లకు చాలా కీలకం..

ABN, Publish Date - May 04 , 2025 | 12:19 PM

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు రసవత్తర మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలోని స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

PBKS VS LSG ipl 2025

ఐపీఎల్ 18వ సీజన్ క్రమంగా చివరి దశకు చేరుతుంది. ఈ సీజన్‌లో 54వ మ్యాచ్‌లో నేడు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ (PBKS VS LSG) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ధర్మశాలలోని HPCA స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. పంజాబ్ రెండో సొంత మైదానం ధర్మశాలలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 13 పాయింట్లతో, పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.


విజయం సాధిస్తే

అదే సమయంలో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో లక్నో 5 గెలిచి, 5 ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇరు జట్లకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధిస్తే ఈ జట్లు ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని దక్కిచుకుంటాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు పంజాబ్, లక్నో మధ్య 4 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పంజాబ్ జట్టు 3 మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా, ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. కానీ ఈ జట్ల ఫఆం పరిశీలిస్తే ఆదివారం ధర్మశాలలోని చిన్న మైదానంలో రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది.


పిచ్ రిపోర్ట్

ప్రపంచంలోని అత్యంత అందమైనది ధర్మశాలలోని HPCA స్టేడియం. ఇక్కడి బౌన్సీ పిచ్‌పై, బ్యాట్స్‌మెన్ షార్ట్ బౌండరీలను సద్వినియోగం చేసుకుంటూ పరుగులు చేయవచ్చు. ఈ మైదానంలో ప్రస్తుత సీజన్‌లో ఇది మొదటి మ్యాచ్ కావడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇక్కడ 13 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు పెద్ద స్కోర్ చేస్తుంది. ఈ మైదానంలో లక్ష్యాన్ని ఛేదించడం కొంచెం కష్టంగా ఉంటుంది.

ఇక్కడ జరిగిన 13 ఐపీఎల్ మ్యాచ్‌లలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మైదానంలో అత్యధిక స్కోరు RCB (241/7) పేరిట నమోదైంది. ఇది 2024లో పంజాబ్‌పై ఇదే మైదానంలో జరిగింది. ఈ క్రమంలో టాస్ గెల్చిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే పంజాబ్ కింగ్స్ జట్టుకు 56 శాతం గెలుపు అవకాశాలు ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు 46 శాతం ఛాన్సుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి:

Virat Kohli Skip Celebration: చెన్నైపై గెలుపు తర్వాత సెలబ్రేట్ చేసుకోని విరాట్ కోహ్లీ..నెట్టింట్ ట్రోల్స్


Virat Kohli: ఆరెంజ్ క్యాప్‌ తిరిగి లాగేసుకున్న విరాట్ కోహ్లీ..ఇలాగే ఉంటుందా..


RCB IPL 2025: ఐపీఎల్ 2025లో అగ్రస్థానంలో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్‌ కోసం ఇంకా ఎన్ని గెలవాలి


Gold Silver Rate Today: షాకింగ్..రూ.7 వేలు పెరిగిన వెండి..కానీ గోల్డ్ మాత్రం..


Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్


Read More Business News and Latest Telugu News

Updated Date - May 04 , 2025 | 12:20 PM