Gold Silver Rate Today: షాకింగ్..రూ.7 వేలు పెరిగిన వెండి..కానీ గోల్డ్ మాత్రం..
ABN , Publish Date - May 04 , 2025 | 06:43 AM
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ వచ్చాయి. కానీ ఆదివారం రోజు మాత్రం ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గత వారం రోజుల్లో వీటి ధరల పరిస్థితి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు (Gold Silver Rate Today) బ్రేక్ పడింది. ఆదివారం (మే 4, 2025న) రోజు వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గత వారం రోజుల్లో వీటి ధరలు తగ్గాయా లేదా పెరిగాయా, తగ్గితే ఎంత తగ్గాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం వీటి ధరలు (మే 4న) గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఉదయం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,551గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 87,541 ఉంది. ఇదే సమయంలో గత వారం అంటే ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,210 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.90,010గా ఉంది. అంటే గత వారం రోజుల్లో వీటి ధరలు రూ.270 తగ్గాయి.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక వెండి విషయానికి వస్తే గత వారం రోజుల్లో భారీగా పెరగడం విశేషం. అంటే మే 4, 2025న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,09,000గా ఉండగా, గత వారం ఏప్రిల్ 27, 2025న కేజీ వెండి ధర రూ.1,01,900గా ఉంది. ఈ క్రమంలో వారం రోజుల్లో ఏకంగా రూ.7100 పెరిగింది. ఈ నేపథ్యంలో బంగారం ధరతో పోలిస్తే వెండి రేటులో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. అంతేకాదు వెండి ధరలు భవిష్యత్తులో పెరుగుతాయని నిపుణులు హెచ్చరించడంతో అనేక మంది బంగారం కంటే ఎక్కువగా వెండిపై పెట్టుబడులు చేశారు. దీంతో వీటి ధరలు గోల్డ్ రేట్లను బీట్ చేశాయి.
ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలు
బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ, భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లపై ఆధారపడతాయి. గత కొన్ని రోజుల్లో అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, డాలర్ విలువలో మార్పులు, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా, డాలర్ బలపడటం వంటి పలు రకాల అంశాలు ధరల తగ్గుదలకు దోహదపడ్డాయి.
రేట్లు భారీగా ఉన్నప్పటికీ అక్షయ తృతీయ (ఏప్రిల్ 30, 2025) సందర్భంగా భారతదేశంలో బంగారం కొనుగోళ్లు భారీగా జరిగాయి. దాదాపు 12 టన్నుల బంగారం, 4,000 కోట్ల విలువైన వెండి అమ్ముడైంది. కానీ పండుగ తర్వాత డిమాండ్ తగ్గడం ధరల స్థిరత్వానికి దారితీసింది.
ఇవి కూడా చదవండి:
Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Hyderabad vs Gujarat: ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
Read More Business News and Latest Telugu News