Virat Kohli Skip Celebration: చెన్నైపై గెలుపు తర్వాత సెలబ్రేట్ చేసుకోని విరాట్ కోహ్లీ..నెట్టింట్ ట్రోల్స్
ABN , Publish Date - May 04 , 2025 | 11:24 AM
ప్రతి సారీ తన జట్టు గెలిస్తే సంబరాలు చేసుకునే విరాట్ కోహ్లీ, ఈసారి మాత్రం సైలెంట్ అయ్యాడు. ఇది తెలిసిన అభిమానులు అసలేమైందని ఆరా తీస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో, చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఆర్‌సీబీ కేవలం రెండు రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో అత్యంత రసవత్తర విజయాల్లో నిలిచిన వాటిలో ఈ మ్యాచ్ కూడా ఒకటి. ఇంతటి విజయం తర్వాత కూడా ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం సెలబ్రేట్ చేసుకోలేదు. గెలుపు తర్వాత కోహ్లీ నిశ్శబ్దంగా మైదానం వీడిన దృశ్యాలు అభిమానుల్లో ఆందోళన రేకెత్తించాయి. ఆ తర్వాత ఒంటరిగా కూర్చున్న సన్నివేశాలతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
అభిమానుల కామెంట్స్
సాధారణంగా సరదాగా ఉండే కోహ్లీ ఈసారి ఎందుకు మౌనంగా కనిపించాడు. ఈ ప్రశ్న అభిమానులతో పాటు నెటిజన్లను కూడా తొలిచేస్తోంది. గెల్చిన తర్వాత విరాట్ కోహ్లీ మాత్రం సంతోషంగా కనిపించలేదు. కెమెరాలు అతన్ని మైదానం నుంచి నిశ్శబ్దంగా నడిచి వెళుతున్న విధానాన్ని చిత్రీకరించాయి. అందుకు సంబంధించిన వీడియో చూసిన అభిమానులు ఏమైంది విరాట్? ఈ రోజు పూర్తిగా వేరే మూడ్‌లో కనిపించావని ఓ అభిమాని ప్రశ్నించాడు. మరొకరు అతన్ని ఎవరో బాగా హర్ట్ చేశారని, ఇంత బలమైన వ్యక్తిని కూడా బ్రేక్ చేయడం ఎలా సాధ్యమని ఇంకొకరు పేర్కొన్నారు.
కౌర్‌తో లింక్
ఇటీవల నటి అవనీత్ కౌర్ తన కొత్త చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ క్రమంలో విరాట్ కోహ్లీ అవనీత్ ఫోటోను లైక్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో అనేక మంది చూసి అతన్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ గాసిప్‌ను అడ్డుకునేందుకు కోహ్లీ నా ఫీడ్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు, ఇన్ స్టా అల్గారిథమ్ వల్ల ఒక పోస్ట్‌ను లైక్ చేసినట్లు అనుకోకుండా నమోదైందని స్పష్టం చేశాడు. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని, దయచేసి ఊహాగానాలు చేయవద్దని కోరాడు. అయినప్పటికీ అనేక మంది మాత్రం కోహ్లీని ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే విరాట్ హర్ట్ అయి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. అవనీత్ ఇంకా ఈ విషయంపై స్పందించనప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్ లైక్ వివాదానికి మరింత ఊతమిచ్చింది.
అభిమానుల మద్దతు
ఈ వివాదాలు ట్రోల్స్ మధ్య కోహ్లీ అభిమానులు అతనికి మద్దతుగా నిలిచారు. "విరాట్ కోహ్లీ ఒక లెజెండ్. ఈ చిన్న చిన్న విషయాలు అతని గొప్పతనాన్ని తగ్గించవు. మేము మీతో ఉన్నాం," అని ఓ అభిమాని రాశాడు. మరొకరు సోషల్ మీడియా ట్రోల్స్‌ను పట్టించుకోవద్దు విరాట్. నీవు ఎప్పటికీ మా హీరో," అని ట్వీట్ చేశారు. మొత్తంగా ఈ సంఘటన కోహ్లీ జీవితంలో ఒక చిన్న అధ్యాయం మాత్రమే అయినప్పటికీ, సోషల్ మీడియా ఎలా చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చగలదో నిరూపించిందని చెప్పవచ్చు. కోహ్లీ తన ఆటతో వ్యక్తిగత జీవితంతో ముందుకు సాగుతూ ఈ ట్రోల్స్‌ను అధిగమిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Virat Kohli: ఆరెంజ్ క్యాప్ తిరిగి లాగేసుకున్న విరాట్ కోహ్లీ..ఇలాగే ఉంటుందా..
RCB IPL 2025: ఐపీఎల్ 2025లో అగ్రస్థానంలో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ కోసం ఇంకా ఎన్ని గెలవాలి
Gold Silver Rate Today: షాకింగ్..రూ.7 వేలు పెరిగిన వెండి..కానీ గోల్డ్ మాత్రం..
Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్
Read More Business News and Latest Telugu News